Begin typing your search above and press return to search.

ఏపీ లో బీసీ రిజర్వేషన్ పై ఉత్కంఠ

ఏపీలో బీసీ జనాభా ఎక్కువ అని చెబుతారు. అంచనాల మేరకు చూస్తే మొత్తం జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటారని లెక్క వేస్తూంటారు.

By:  Satya P   |   19 Jun 2026 1:00 PM IST
ఏపీ లో బీసీ రిజర్వేషన్ పై ఉత్కంఠ
X

ఏపీలో బీసీ జనాభా ఎక్కువ అని చెబుతారు. అంచనాల మేరకు చూస్తే మొత్తం జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటారని లెక్క వేస్తూంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎపుడూ కులగణన అన్నది జరగలేదు. ఎపుడో దశాబ్దాల క్రితం నాటి వివరాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కుల గణనతో పాటు జనాభా గణనను కలిపి లెక్కించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా పక్కాగా సమాచారం రావచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక బీసీలకు రిజర్వేషన్లు ఎంత శాతం ఇవ్వాలన్న దాని మీద చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అన్నది అతి ముఖ్య పాత్రను పోషించబోతోంది.

డిడికేటెడ్ కమిషన్ ద్వారా :

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ని ఆ మధ్య నియమించింది. ఈ కమిషన్ ఏపీలోని మొత్తం 28 జిల్లాలలో పర్యటించి ఆయా ప్రాంతాలలో బీసీల సామాజిక వర్గాల పరిస్థితులు ఆర్ధిక సామాజిక రాజకీయ కోణంలో సమగ్రమైన అధ్యయనం చేయడం ద్వారా పూర్తి నివేదికను తెప్పించుకోవాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో డెడికేషన్ కమిషన్ జిల్లాలలో పర్యటిస్తోంది.

త్వరలోనే నివేదిక :

రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అంటున్నారు. ఇక ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఖరారు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ త్వరలోనే పూర్తి నివేదికను సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి అందుతున్న సూచనలు, వినతులను పరిశీలించి సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి న్ సమర్పిస్తామని రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం

యాభై శాతం డిమాండ్ :

ఇదిలా ఉంటే బీసీలు జనాభాలో సగం ఉన్నందున తమ వాటా ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు కోరుతున్నారు. దాదాపుగా 160కి పైగా బీసీ కులాలు ఏపీలో ఉన్నాయి. ఇందులో ఆరేడు శాతానికి పైగా జనాభా ఉన్న బీసీ కులాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రాలో చూస్తే ఏకంగా 80 శాతం బీసీలే ఉన్నారు. అలాగే కోస్తాలోని మొత్తం 101 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చూస్తే కనుక మెజారిటీ బీసీలు ఉన్నాయి. ఇక రాయలసీమ జిల్లాలలోనూ తమ సంఖ్య అధికమే అని చెబుతున్నారు. రాజకీయంగా తాము ఇంతకాలం నష్టపోయామని ఇపుడు తమ జనాభాను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని వారు అంటున్నారు.

బీసీల పార్టీగా :

ఇక చూస్తే ఏపీలో కూటమిని నాయకత్వం వహిస్తున్న టీడీపీ బీసీల పార్టీగా ప్రాచుర్యం పొందింది. టీడీపీ పుట్టిన నాటి నుంచీ బీసీలకు రాజకీయ అవకాశాలు పెద్ద ఎత్తున లభించాయి. ఈ నేపధ్యంలో టీడీపీ కూటమి బీసీ కమిషన్ ని నియమించడం ద్వారా అధిక శాతం రిజర్వేషన్లు ఆ సామాజిక వర్గానికి దక్కేలా చూడాలని అనుకుంటోంది. తద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని బీసీలకు అత్యధిక మేలు చేసిన పార్టీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. దీంతో బీసీలకు రిజర్వేషన్లు ఏపీలో ఎంత దక్కుతుంది అన్నది ఉత్కంఠను పెంచుతోంది. ఈ నెలాఖరు నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.