Begin typing your search above and press return to search.

తీర్పు: టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ హీట్‌ ఖాయం ..!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పు రాజ‌కీయ వేడిని మ‌రింత పెంచ‌నుంది.

By:  Tupaki Desk   |   28 Sept 2026 10:46 AM IST
తీర్పు:  టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ హీట్‌ ఖాయం ..!
X

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పు రాజ‌కీయ వేడిని మ‌రింత పెంచ‌నుంది. బీసీ సామా జిక వ‌ర్గాల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తామ‌ని కూట‌మి స‌ర్కారు ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ద‌రి మిలా.. ఇది చెల్ల‌నేర‌దంటూ.. కొంద‌రు హైకోర్టుకు వెళ్లారు. వీరిలో వైసీపీ నాయ‌కులు కూడా ఉన్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ.. త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. కోర్టుల్లో కేసులు వేయిస్తున్న‌ది కూడా టీడీపీనేన‌ని వైసీపీ వాదిస్తోంది. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ కూడా చెబుతున్నారు.

స‌రే.. మొత్తంగా హైకోర్టులో ప్ర‌స్తుతం 34 శాతం రిజ‌ర్వేష‌న్ విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. సాధార‌ణంగా అన్ని వ‌ర్గాల‌కు అంటే.. బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు క‌లిపి ఎన్ని రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసినా.. 50 శాతానికి మించ‌రాద‌న్న సుప్రీంకోర్టు తీర్పులు ఉద‌హ‌రిస్తున్నారు. అయితే.. మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ 69 శాతం వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్ ఇచ్చార‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మొత్తంగా ఈ వాద‌న‌లు కూడా పూర్త‌య్యాయి. రేపో మాపో.. దీనిపై హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది.

అయితే.. ఇది ఎలా వ‌చ్చినా.. రాజ‌కీయంగా వైసీపీ, టీడీపీల మ‌రోసారి యుద్ధం జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 34 శాతానికి అనుకూలంగా తీర్పు వ‌స్తే.. వైసీపీ చేసిన త‌ప్పును తాము స‌రిచేశామ‌ని టీడీపీ చెప్పుకొం టుంది. త‌ద్వారా స్థానిక ఎన్నిక‌ల్లో పుంజుకునేందుకు.. వైసీపీని బ‌లంగా దెబ్బ‌కొట్టేందుకు దీనిని ఆయుధంగా వాడుకోనుంది. ఒక‌వేళ 34 శాతానికి వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే.. వైసీపీ వేసిన పిటిష‌న్ల కార‌ణంగానే బీసీల‌కు అన్యాయం జ‌రిగింద‌న్న వాద‌న‌ను కూడా టీడీపీరెడీచేసుకుంది. సో.. తీర్పు ఎలా ఉన్నా.. టీడీపీ పైచేయి సాధించే ప్ర‌య‌త్నం చేయ‌నుంది.

మ‌రి వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌. రిజ‌ర్వేషన్ల‌కు తాము వ్య‌తిరేకం కాదంటున్నా.. 34 శాతం గుండుగుత్త‌గా బీసీల‌కు ఇచ్చే విష‌యంలో వైసీపీ త‌ట‌పటాయిస్తోంది. ఇత‌ర వ‌ర్గాల‌కు రిజ‌ర్వేషన్ కార‌ణంగా ఇబ్బందులు వ‌స్తా య‌న్న అంచ‌నాలో ఉంది. దీంతో ఇప్ప‌టికైతే.. దీనిపై ఎలాంటి వ్యూహాలు లేవు. కానీ, తీర్పును బ‌ట్టి స్పందించే విషయంలో ఆలోచ‌న చేస్తామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొంటున్నారు. కానీ, టీడీపీ దూకుడు ఇప్ప‌టికే పెంచేసిన ద‌రిమిలా.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగ‌క‌పోతే.. మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌ద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. రిజ‌ర్వేష‌న్ల‌ను స్వాగ‌తించాల‌ని కోరుతున్నారు.