Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ టైమ్‌: లోకేష్ సూచ‌న‌.. అయ్య‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీలో విద్యారంగాన్ని కొత్త‌పుంత‌లు తొక్కిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. మెగా పేరెంట్ మీటింగ్స్‌తో దుమ్ము రేపుతున్నారు.

By:  Garuda Media   |   6 Feb 2026 3:39 PM IST
ఫ‌స్ట్ టైమ్‌: లోకేష్ సూచ‌న‌.. అయ్య‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం
X

ఏపీలో విద్యారంగాన్ని కొత్త‌పుంత‌లు తొక్కిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. మెగా పేరెంట్ మీటింగ్స్‌తో దుమ్ము రేపుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న విద్యార్థుల‌పై మ‌రింత శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. త‌ల్లిదండ్రుల‌తో ఇంట రాక్ట్ అవుతూ.. విద్య‌ విష‌యంలో విద్యార్థుల‌పై మాన‌సిక ఒత్తిడిని త‌గ్గిస్తున్నారు. ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి మెగా పేరెంట్ మీటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో విద్యార్థుల‌కు కొత్త అంశాల‌ను కూడా నేర్పిస్తున్నారు.

త‌ద్వారా విద్యార్థుల్లో అభిరుచులు పెంచుకునేందుకు పెద్ద‌పీట వేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసింగ్‌పై విద్యార్థుల‌కు అవగాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇది గ‌త నెల రోజులుగా సాగుతోంది. పోలీసులు త‌మ సిబ్బంది తో వెళ్లి విద్యార్థుల‌కు త‌మ విధుల‌ను వివ‌రిస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో తాము ఎలా స్పందిం చేదీ చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇటు ప్ర‌భుత్వానికి, అటు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సేవ‌లు అంది స్తున్నారో చెబుతూ.. పోలీసు విధుల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న పెంచుతున్నారు.

ఇదే ప‌రంప‌ర‌లో మంత్రి నారా లోకేష్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తొలిసారి రాష్ట్ర చ‌రిత్ర‌లో అసెంబ్లీకి విద్యార్థుల‌ను తీసుకురావాల‌ని.. వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. గ‌త నెల‌లో మాక్ అసెంబ్లీని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే 8-10 త‌ర‌గతుల‌ విద్యా ర్థుల‌ను అసెంబ్లీకి తీసుకువ‌చ్చి వారితో మాక్ అసెంబ్లీని నిర్వ‌హించారు. దీనికి సీఎం చంద్ర‌బాబు కూడా హాజ‌ర‌య్యారు. త‌ద్వారా ప్ర‌జాప్ర‌తినిధుల బాధ్య‌త‌లు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న‌.. వంటివాటిలో వారికి త‌ర్ఫీదు ఇచ్చారు.

ఇప్పుడు.. తాజాగా ఈ నెల 11 నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నేరుగా వీక్షించేలా విద్యా ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. స‌భ జ‌రిగే అన్ని రోజులు(ఎన్ని రోజులు అనేది తొలి రోజు నిర్ణ‌యిస్తారు) విద్యార్థుల‌ను స‌భ‌కు అనుమ‌తించ‌నున్నారు. ఈ మేర‌కు నారా లోకేష్ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా అంగీక‌రించారు. దీంతో విడ‌త‌ల వారీగా విద్యార్థుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

స‌భ జ‌రిగే అన్ని రోజులు రోజుకు ఒక్కొక్క జిల్లా నుంచి ఎంపిక చేసిన పాఠ‌శాల విద్యార్థుల‌ను 45 నిమిషాల చొప్పున గ్యాల‌రీల్లోకి అనుమ‌తిస్తారు. వారికి అక్క‌డే ఉచితంగా భోజ‌నం అందిస్తారు. ప్ర‌తి 45 నిమిషాల‌కు ఒక బ్యాచ్‌(30 మంది) ను లోప‌లికి పంపుతారు. ఇలా రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను(ఉత్సాహం ఉన్న‌వారికి) స‌భ‌కు పంప‌నున్నారు. వీరు స‌భా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష‌గా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు.