Begin typing your search above and press return to search.

జగన్ రూటే సపరేటు.. మరోసారి కీలక నిర్ణయాలతో రూట్ పైకి ప్రతిపక్ష నేత

ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యగా వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2025 4:00 PM IST
జగన్ రూటే సపరేటు.. మరోసారి కీలక నిర్ణయాలతో రూట్ పైకి ప్రతిపక్ష నేత
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో మార్పులు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యగా వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తుండడంతో కొత్త లెక్కలు ప్రారంభమయ్యాయి. కూటమిలో ఉన్న మూడు పార్టీలు దేనికదే పార్టీ కేడర్ ను స్ట్రాంగ్ చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేకెత్తిస్తోంది.

సెప్టెంబర్ 17 నుంచి సభ..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉండేందుకు జగన్ సమ్మతించలేదు. సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పార్టీకి దక్కలేదు. కానీ ఇటీవల తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేశారు. అది ఇస్తేనే వస్తానని రావడం లేదు. పార్టీ పెద్ద అసెంబ్లీకి రాకుంటే తాము వెళ్లి సాధించేదేంటని పార్టీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు రావడం లేదు. వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం సూత్ర ప్రాయంగా చెప్తోంది. అసెంబ్లీ సమావేశాలపై సెప్టెంబర్ 4వ తేదీ కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సారి జగన్ హాజరవుతారా..?

రాష్ట్ర ప్రజలు, పార్టీ కేడర్ కోరిక మేరకు జగన్ కూడా హాజరవుతానని పార్టీ కేడర్ నుంచి సమాచారం అందుతోంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 15 నెలలు కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 15 నెలలుగా తనపై వస్తున్న ఆరోపణలను ఈ సమావేశాలకు హాజరై ఖండించాలని మాజీ సీఎం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమరావతి విషయంలో కూడా జగన్ యూ టర్న్ తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మూడు రాజధానులకు ప్రజా మద్ధతు లేకపోవడంతో ఆలోచనను మార్చుకున్నట్లు చెప్తున్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జగన్ సిద్ధం అయ్యారా..?

ప్రభుత్వం కూడా ఎవరైనా ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని యోచిస్తోంది. రాజధాని నిర్మాణం, భూ సేకరణ, తదితర విషయాలను ప్రజలకు ఎలా వివరించాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక జగన్ రాజధానిలోని లోపాలతో పాటు లిక్కర్ కేసులో అరెస్ట్ లాంటి విషయాలను ప్రధానంగా మాట్లాడుతారని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ యూ టర్న్ తీసుకున్నాడా..? దీంతో ప్రజలకు దగ్గరవ్వనున్నాడా..? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.