ఏపీ అసెంబ్లీ ఎప్పటి దాకా.. షెడ్యూల్ ఇదీ!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. అనంతరం.. గవర్నర్ ప్రసంగించారు.
By: Garuda Media | 11 Feb 2026 10:49 PM ISTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. అనంతరం.. గవర్నర్ ప్రసంగించారు. ఈ ప్రసంగం తర్వాత.. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే విష యంపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) సమావేశమైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు.. ఈ సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి వైసీపీ కూడా రావాలి. కానీ, ఆ పార్టీ తరఫున ఎవరూ పాల్గొనలేదు.
ఇక, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. 17 రోజుల పాటు సభను నిర్వహించనున్నారు. అంటే .. మొత్తం అన్ని సెలవులతో కలుపుకొని.. మార్చి 7వ తేదీ వరకు కూడా అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణ యించారు. అవసరం అయితే.. మాత్రం సమయాన్ని మరో నాలుగు రోజుల పాటు పొడిగించనున్నారు. అయితే.. ఈ నిర్ణయంలో సభ్యుల వ్యవహారంపై ఆధారపడి ఉండనుంది. సమగ్ర చర్చలు అవసరమైన అంశాల్లో సమయం ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంటే.. అప్పుడు మాత్రమే సభ రోజులు పెంచే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.
ఇదీ షెడ్యూల్..
+ బడ్జెట్ సమావేశాలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు.
+ 17 రోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు సాగనున్నాయి.
+ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు.
+ ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెడతారు. 2026-27 బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
+ 15, 16వ తేదీల్లో సెలవు ప్రకటించారు.
+ 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చిస్తారు.
+ 18న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. సమాధానం ఇస్తారు.
+ ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు.
+ మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు.
+ వచ్చే నెల 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు.
+ 6 కీలక ఆర్డినెన్స్‌లకు సభ ఆమోదం తెలపనుంది.
