Begin typing your search above and press return to search.

'కూట‌మి'కి ఇలాంటి ప్ర‌చారం మంచిదేనా?

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి పార్టీల‌కు సీట్ల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   24 Oct 2026 5:00 PM IST
కూట‌మికి ఇలాంటి ప్ర‌చారం మంచిదేనా?
X

ఏపీలో కూట‌మి పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌పై రాజ‌కీయంగానే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా.. ఇబ్బందిక‌ర అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొన్ని కొన్ని విష‌యాలు నాలుగు గోడ‌ల మ‌ధ్యే జ‌రిగిపోవాలి. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌ల విష‌యాలు కూడా.. నాలుగు గోడ‌ల మ‌ధ్యే ఉండాలి. కానీ.. ఎవ‌రు బ‌య‌ట‌కు చెబుతున్నారో.. ఎందు కు చెబుతున్నారో.. తెలియ‌దు కానీ.. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండాల్సిన విష‌యాలు సోష‌ల్ మీడియాలోకి వ‌స్తున్నా యి. త‌ద్వారా.. ప్ర‌జ‌ల్లో కూట‌మి పార్టీల‌పై చుల‌క‌న భావం పెరుగుతోంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి పార్టీల‌కు సీట్ల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే. స్థానిక ఎన్నిక‌ల్లో మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల స‌ర్దుబాటు అయిపోయింద‌ని అనుకున్నా.. త‌ర్వాత టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు చెందిన రెబ‌ల్స్ రంగంలోకి దిగి నామినేష‌న్ వేశారు. దీనిపై పార్టీలు మౌనంగా ఉన్నాయి. ఇక‌, తాజాగా ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. వీటికి కూడా నామినేష‌న్ల ప‌ర్వం శుక్ర‌వారంతో ముగిసిపోయింది. కానీ.. సీట్ల పంప‌కాల విష‌యం మాత్రం తెగ‌లేదు.

దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే క‌లుసుకోవ‌డం.. సీట్ల స‌ర్దుబాటుపై ప‌వ‌న్ అభ్య‌ర్థించ‌డం వంటివి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున క‌థ‌నాలుగా వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన మీడియాలోనూ ఇదే చ‌ర్చ సాగుతోంది. స‌హజంగానే కూట‌మి అన్నాక‌.. సీట్ల స‌ర్దుబాటు అంత ఈజీకాక‌పోవ‌చ్చు. అనుకున్నంత తేలిక కూడా కాదు. కానీ.. ఈ అంత‌ర్గ‌త విష‌యాలు సాధ్య‌మైనంత వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ధ్యే ప‌రిష్కారం అయి.. ఇరు ప‌క్షాలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన త‌ర్వాత‌.. సంయుక్త మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తే.. అది విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేది కాదు.

కానీ, ప‌దే ప‌దే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్.. టీడీపీ అధినేత‌ను క‌లుసుకున్నార‌ని.. సీట్ల‌పై చ‌ర్చించార‌ని.. ఇంకా కొలిక్కి రాలేదని వార్త‌లు రావ‌డంపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన కోరుతున్న సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేద‌న్న ప్ర‌చారం కూడా మ‌రోవైపు టీడీపీ వ‌ర్గాల నుంచే జ‌రుగుతోంది. జ‌నసేన నాయ‌కులు కూడా అసంతృప్తితోనే ఉన్నార‌న్న వాద‌న బ‌ల‌ప‌డుతోంది. దీనికి కార‌ణం.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించి.. ఒక నిర్ణ‌యానికి రావాల్సిన సీట్ల వ్య‌వ‌హారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు లీకు చేయ‌డ‌మేన‌న్న‌ది ఇరు పార్టీల్లోని సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. కూట‌మిపై చుల‌క‌న భావం పెరుగుతుంద‌ని అంటున్నారు. సో.. ఈ విష‌యాన్ని ఇరు పార్టీలు గ‌మ‌నించి.. చ‌ర్చ‌ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ర‌హ‌స్యంగానే పూర్తి చేయ‌డం మంచిద‌ని అంటున్నారు.