Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ పై తొలిసారి కేంద్రమంత్రి రియాక్షన్.. ఇప్పుడేం జరగనుంది?

తెలంగాణతో పాటు ఏపీ.. ఆ మాటకు వస్తే దేశ రాజకీయాల్లో కేసీఆర్ సర్కారు ట్యాపింగ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   4 April 2024 4:47 AM GMT
ట్యాపింగ్ పై తొలిసారి కేంద్రమంత్రి రియాక్షన్.. ఇప్పుడేం జరగనుంది?
X

తెలంగాణతో పాటు ఏపీ.. ఆ మాటకు వస్తే దేశ రాజకీయాల్లో కేసీఆర్ సర్కారు ట్యాపింగ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్యాపింగ్ లో కేసీఆర్ అండ్ కో హస్తం ఎంతన్న విషయంపై క్లారిటీ వచ్చింది లేదు. ఇప్పటివరకు వెలుగు చూసిన అంశాలు.. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారంతా ట్యాపింగ్ కు పాల్పడినట్లు.. దానికి సంబంధించిన అంశాలు.. ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ లాంటి అంశాల్ని వివరంగా చెప్పేయటం తెలిసిందే. ఇప్పటికే పలువురు జైలుపాలు కాగా.. లైన్లో మరికొందరు ఉన్నట్లు చెబుతున్నారు.

ట్యాపింగ్ అంశంపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదన్న మాట వినిపిస్తోంది. ఈ లోటు తాజాగా తీరిపోయింది. కారణం.. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చేవారు. తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంతకాలం వరకు ట్యాపింగ్ అంశంపై ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర మంత్రి.. తాజాగా చేయటం చూస్తే.. రానున్నరోజుల్లో ఏం జరగనుందన్న అంశంపై కాస్తంత క్లారిటీ వచ్చేసినట్లేనని చెప్పాలి.

ట్యాపింగ్ విషయంపై స్పష్టత వచ్చే వరకు ఆగాలన్నట్లుగా కేంద్రం తీరు కనిపిస్తోందని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఇటీవల కాలంలో ట్యాపింగ్ అంశంపై గళాన్ని విప్పటమే కాదు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వేళలోనే కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించటం చూస్తే.. ఈ అంశంలోకి కేంద్రం ఎంట్రీ ఇవ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తుంటే.. గులాబీపార్టీకి రాబోయే రోజుల్లో షాకుల మీద షాకులు తగలనున్నట్లుగా చెబుతున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదుగా..?