వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలడం ఖాయం.. విశ్లేషకుల లెక్కలు ఇవే!
ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా చూస్తానని.. వ్యతిరేకత చీలకుండా చూడడమే తన లక్ష్యమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 July 2023 2:50 PM ISTఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా చూస్తానని.. వ్యతిరేకత చీలకుండా చూడడమే తన లక్ష్యమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎన్డీయే కూటమి తో భేటీ అయిన తర్వాత కూడా ఆయన ఇదే మాట చెప్పారు. దీనికి గాను తాను బీజేపీ-టీడీపీలతో సమన్వ యం చేసుకుని ముందుకు సాగాలని చూస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ విషయంలో అలుపెరుగని ప్రయత్నాలు తనవైపు నుంచి సాగుతూనే ఉంటాయని కూడా ఆయన వెల్లడించారు.
ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, కేవలం ఈ మూడు పార్టీలే ఏపీలో ఉన్నాయా? అనేది ఇప్పుడు ప్ర ధాన ప్రశ్న అంటున్నారు విశ్లేషకులు. అదేసమయంలో టీడీపీ-జనసేనలు కలిసి బీజేపీతో ముందుకు సాగడం వల్ల.. మోడీపై ఉన్న వ్యతిరేకత కావొచ్చు.. లేదా. కేంద్రం తమకు ఏమీ ఇవ్వలేదు. ఈ పార్టీ మద్దతు మన కెందుకు అనే భావన ప్రజల్లోకి వెళ్తే.. అప్పుడు ఓటు చీలిపోయి.. వైసీపీకి మేలు చేయడం ఖాయమని మరో విశ్లేషణ తెరమీదికి వచ్చింది.
ఈమూడు పార్టీలు ఇలా ఉంటే.. బీఎస్పీ, ఆప్, లోక్‌సత్తా, ఎంఐఎం, బీఆర్ ఎస్, సీపీఐ, సీపీఎం.. ఇలా చిన్న చితక పార్టీలు మరికొన్ని వేటికవే రంగంలోకి దిగడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇవేవీ.. కూడా బీజేపీతో కలిసి ఉన్న పార్టీలకు మద్దతిచ్చే పరిస్థితి లేదు. గత 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి బీఎస్పీ 12 నియోజకవర్గాల్లో పోటీ చేసి.. 2 శాతం ఓటు బ్యాంకు తెచ్చుకుంది. ఆప్ ఒంటరిగా పోటీ చేసి 1.5 శాతం ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది. లోక్ సత్తా 0.5 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి.
ఇక, సీపీఐ, సీపీఎంలు గత ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి 2-4 శాతం ఓటు బ్యాంకు సంపాయించు కున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలకు తోడు మైనారిటీ వర్గాలు బలంగా ఉన్న 22 నియోజకవర్గాల్లో ఎంఐఎం, తెలంగాణతో సరిహద్దును పంచుకునే 18 నియోజకవర్గాలలో బీఆర్ ఎస్‌లు వ్యూహాత్మక ఒంటరిసమరానికి దిగితే.. అప్పుడు ఓటు బ్యాంకు చీలిపోదా! వైసీపీ వ్యతిరేక ఓటు ఆయా పార్టీలకు పడకుండా. ఎవరూ ఆపలేరు! అనేది విశ్లేషకుల మాట. ఎలా చూసుకున్నా.. ఎన్ని ఎత్తులు వేసుకున్నా.. ప్రజల్లో నమ్మకం కలిగిస్తేనే పవన్ పాచిక పారుతుందని.. చెబుతున్నారు.
