Begin typing your search above and press return to search.

మోడీ ఖాతాలో మరో రికార్డ్... దరిదాపుల్లో మరొకరు లేరు!

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ... ఈ విషయంలో తాజాగా మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 12:21 PM GMT
మోడీ ఖాతాలో మరో రికార్డ్... దరిదాపుల్లో మరొకరు లేరు!
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఖాతాలో మరో రికార్డ్ జమ చేసుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ... ఈ విషయంలో తాజాగా మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన యూట్యూబ్ ఛానల్ రికార్డ్ స్థాయిలో సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ విషయంలో మోడీ దరిదాపుల్లో మరో నేత లేకపోవడం గమనార్హం. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్ మంగళవారం సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇందులో భాగంగా మోడీ యూట్యూబ్ ఛానల్ 20 మిలియన్ సబ్‌ స్క్రిప్షన్‌ లను అధిగమించడం ద్వారా మరో మైలురాయిని సాధించింది. దీంతో అగ్రశ్రేణి గ్లోబల్ లీడర్‌ లలో అత్యధికంగా సబ్ స్క్రైబర్స్ కలిగిన ఛానెల్‌ గా రికార్డ్ సృష్టించింది. మోడీని ఇండియన్స్ తో పాటు ప్రపంచ దేశాలలోని నెటిజన్లు ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.

ఈ జాబితాలో మోడీ తర్వాత స్థానం రెండవ ర్యాంక్ లో బ్రెజిలియన్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనోరా ఉన్నారు. ఈయన 6.4 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రెండో గ్లోబల్ లీడర్‌ గా నిలిచారు. ఇదే సమయంలో మూడవ స్థానంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ 1.1 మిలియన్లతో ఉండటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ తన యూట్యూబ్ ఛానెల్‌ లో 7,94,000 మంది సబ్‌ స్క్రైబర్లను మాత్రమే కలిగి నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక వ్యూస్ విషయానికొస్తే... డిసెంబర్ 2023లో 2.24 బిలియన్ వ్యూస్ నమోదు చేస్తూ మోడీ ఛానెల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక వ్యూస్ కలిగి ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కంటే 43 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ నెంబర్లు, ట్యూబ్‌ లో మోడీ సాధించిన విజయం అతని డిజిటల్ నైపుణ్యం, విస్తృతమైన ప్రపంచ ఆకర్షణను ప్రతిబింబిస్తుందనే ప్రశంసలు పొందుకుంటుంది.

కాగా... 23వేల వీడియోలు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ 2022 ఫిబ్రవరి లోనే కోటి మంది సబ్ స్క్రైబర్స్ ని దాటిన సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ పొలిటీషియన్స్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానల్ లో 1.8 వేల వీడియోలతో 3.51 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ని కలిగి ఉంది!