'మోడీ స్ఫూర్తి' ని వదులుకున్న బీజేపీ!
అంతేకాదు.. ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలోనే ఆర్ ఎస్ ఎస్ భావజాలం వైపు అడుగులు వేశారు.
By: Garuda Media | 5 Jun 2026 3:41 PM IST''నాకు మోడీనే స్ఫూర్తి.. అందుకే ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిట్‌ర్మెంట్ ప్రకటించి.. దేశ సేవ కోసం.. రాజకీయాల్లోకి వస్తున్నాను.'' 2019 మార్చిలో బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పటి ఐపీఎస్ అధికారిగా.. బెంగళూరు నగర డీసీపీగా వ్యవహరిస్తున్న అన్నామలై.. చేసిన ప్రకటన ఇది. ఇక్కడి తోనే ఆయన ఆగిపోలేదు. ఆ తర్వాత కూడా పదే పదే మోడీ తనకు స్ఫూర్తి అంటూ.. తమిళనాడులో ప్రచారం చేశారు.
అంతేకాదు.. ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలోనే ఆర్ ఎస్ ఎస్ భావజాలం వైపు అడుగులు వేశారు. తమిళనాడు నుంచి కాశీ(ప్రధాని సొంత నియోజకవర్గం)కి భక్తులను తరలించి.. తమిళ-కాశీసంగ మం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే.. అది తమిళనాడులో వర్కవుట్ అవుతుందని ప్రధానికి ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ఈ ప్రతిపాదన నచ్చి-మెచ్చిన మోడీ.. ఆవెంటనే ఉచితంగా తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులను కాశీకి తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇది సత్ఫలితాలను కూడా ఇచ్చింది. అన్నామలై 2019లో బీజేపీలో చేరిన తర్వాత.. తమిళనాడు అధ్యక్షు డు కావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టినా.. 2024 ఎన్నికల్లో ఆయన సత్తా చూపించారు. అప్ప టి వరకు 3.6 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును ఏకంగా 11.3 శాతానికి తీసుకువెళ్లారు. ఏకంగా బీజేపీ కోసం.. పదవిని కూడా వదులుకున్న ఆయన.. ఇప్పుడు అదే బీజేపీకి రాజీనామా చేశారు. సైద్ధాంతిక విభేదాలు.. అన్నాడీఎంకేతో చేతులు కలిపిన తీరు వంటివి ఆయనకు నచ్చలేదు.
ఇక బీజేపీ కూడా అన్నామలైను వదిలేసుకుంది. తద్వారా.. తమిళనాట బలమైన గళం వినిపించే యువ నాయకుడిని పార్టీ దూరం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, ఇప్పుడు సొంత పార్టీ దిశగా అన్నామలై రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇది బీజేపీ ఓటు బ్యాంకును కూడా తీవ్రంగా ప్రభావితం చేయనుందని పరిశీలకులు చెబుతున్నారు ఏదేమైనా.. మోడీ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వారిని బీజేపీ కాపాడుకోలేక పోయిందన్న వాదన అయితే.. బలంగా వినిపిస్తోంది.
