Begin typing your search above and press return to search.

తమిళ ఎన్డీయేలో సీట్ల చిచ్చు- కాషాయం కుతకుత

దాంతో దీని మీద ఏకంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా బీజేపీ హైకమాండ్ కి లేఖాస్త్రం సంధించారు.

By:  Satya P   |   28 March 2026 8:45 AM IST
తమిళ ఎన్డీయేలో సీట్ల చిచ్చు- కాషాయం కుతకుత
X

తమిళనాడులో ఎన్డీయేలో సీట్ల కేటాయింపు పంపకం మీద బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తక్కువ సీట్లు ఇచ్చారు అన్న బాధ ఒక వైపు ఉంటే కేటాయించిన సీట్లు కూడా గెలిచేవి కావన్న ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది. దాంతో దీని మీద ఏకంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా బీజేపీ హైకమాండ్ కి లేఖాస్త్రం సంధించారు. ఒప్పందానికి తూట్లు పొడిచే బీజేపీకి కేటాయించిన సీట్లు ఉన్నాయని ఆయన కేంద్ర పెద్దల దృష్టికి తీసుకుని వచ్చారని చెబుతున్నారు.

గెలుపు గుర్రాలేవీ :

బీజేపీ చాలా ఈజీగా గెలిచే కినతుకడవుతో సహా పలు నియోజకవర్గాలను అన్నాడీఎంకే అభ్యర్థులు తీసుకున్నారని ఆయన ఆ లేఖలో ఆరొపించారు అని అంటున్నారు. ఇదే రకమైన పరిస్థితి ఉంటే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ఆయన ఖండితంగా చెప్పేశారు అని అంటున్నారు. ఈ సీట్లతో పోటీ పడే కన్నా ఎన్నికల బరిలో నుంచి దూరంగా వెనక్కి తప్పుకోవడమే ఉత్తమం అని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు.

కాషాయం ఆందోళనలు :

ఇదిలా ఉంటే తమకు పట్టున్న గెలుపు అవకాశాలు ఉన్న సీట్లను అన్నాడీఎంకే తాము ఉంచుకుని వేరే సీట్లను ఇవ్వడం పట్ల తమిళ కాషాయం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. దాంతో చాలా నియోజకవర్గాలలో బీజేపీ క్యాడర్ బయటకు వచ్చి ఆందోళలను నిర్వహిస్తున్నారు అంతే కాదు బాహాటంగానే తన తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే కనుక కినాతుకడవులో బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించడం మిత్రుల మధ్య పోరు సాగుతోంది అన్నది బట్టబయలు చేసింది అంటున్నారు.

ఈ సీట్లేంటి అంటూ :

ఇక ఈ మధ్యనే అన్నా డీఎంకే బీజేపీల మధ్య సీట్ల పంపకం జరిగింది. ఆ మేరకు చూస్తే కనుక తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఎన్డీయేలో పొత్తులో భాగంగా అన్నాడీఎంకే సింహ భాగంగా 169 స్థానాలలో పోటీ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉంటూ అన్నా డీఎమేకి అతి పెద్ద అండగా ఉన్న బీజేపీకి మాత్రం కేవలం 27 స్థానాలనే ఇచ్చింది. ఇక ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలలో పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు ఇచ్చారు. ఇతర మిత్రుల సంగతి ఎలా ఉన్నా కమల శిబిరంలో మాత్రం అంతా కుతకుత లాడుతున్నారు. ఒక వైపు చూస్తే తమిళ దళపతి టీవీకే అధిపతి విజయ్ పార్టీతో ఎన్డీయే గెలుపు అవకాశాల మీద ప్రభావం గట్టిగా పడుతోంది అని అంటున్నారు. దానికి తోడు అన్నా డీఎంకే బీజేపీల మధ్య పొత్తు పేచీలు కనుక ముదిరితే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. మరి అన్నా డీఎంకే మీద ఒత్తిడి పెంచి కోరుకున్న సీట్లను బీజేపీ తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.