తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ సీన్, ప్రజలకు చెవులు కుట్టిస్తున్న సర్కార్..!
ఎన్నికల ఏడాదిలో తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష అన్నాడిఎంకే అన్ని వైపుల నుంచి అధికార డిఎంకెని టార్గెట్ చేస్తోంది.
By: Garuda Media | 18 Feb 2026 5:41 PM ISTఎన్నికల ఏడాదిలో తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష అన్నాడిఎంకే అన్ని వైపుల నుంచి అధికార డిఎంకెని టార్గెట్ చేస్తోంది. జయలలిత మరణం తర్వాత పార్టీ బలహీన పడింది అనే వారి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో విడుదల చేసింది అన్నాడిఎంకే. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి తంగం తేన్నరసు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజలకు చెవులు కుట్టే కార్యక్రమంలా ఉందని అన్నాడిఎంకే ఆరోపించింది.
గత నాలుగున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిందని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు సిద్దమైందని, కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని అన్నాడిఎంకే ఓ ఆహ్వాన పత్రికను, ఓ వీడియోను రిలీజ్ చేసింది. అధికార డిఎంకే నేతలు ఓ పెద్ద సూది పట్టుకుని ప్రజలకు చెవులు కుట్టేందుకు ఇళ్ళ వెంట తిరుగుతూ ఉంటారు. వారిని చూసి ప్రజలు భయపడి పరుగులు తీస్తున్న వీడియో విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్ గా వైరల్ అవుతోంది.
తమిళం అర్ధం కాని వారికి కూడా వీడియోలో సన్నివేశాలు క్లియర్ గా అర్దమవుతున్నాయి. ఇక ఆహ్వాన పత్రికతో సభలోకి అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు ఎంట్రీ ఇచ్చారు. తాత్కాలిక బడ్జెట్ చిన్న పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమంగా ఉందని, ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని తెలిపింది. 'బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది' అని ఆహ్వాన పత్రికలో ముహూర్తం కూడా ప్రింట్ చేసారు. తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి 'ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారని ఎద్దేవా చేసింది.
