Begin typing your search above and press return to search.

అంజూ పెళ్లి అంతర్జాతీయ కుట్ర... మంత్రి కీలక వ్యాఖ్యలు!

అంజూ వ్యవహారం ఓ అంతర్జాతీయ కుట్ర అని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా అభివర్ణించారు

By:  Tupaki Desk   |   31 July 2023 10:17 AM GMT
అంజూ పెళ్లి అంతర్జాతీయ కుట్ర... మంత్రి కీలక వ్యాఖ్యలు!
X

పాకిస్థాన్ వ్యక్తితో ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం కాస్తా మోహం గానో, ప్రేమగానో, మైకంగానో మారి.. వ్యవహారం ముదిరి పాకాపడిన సంగతి తెలిసిందే. ఫలితంగా భర్త, ఇద్దరు పిల్లల ను వదిలేసి రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయింది అంజూ అనే మహిళ!

అనంతరం అక్కడ ముస్లిం పద్దతి లో దుస్తులు ధరించడం, ఫోటో షూట్ లలో పాల్గొనడం... జరిగిన తంతంతా తెలిసిందే. అయితే ఆమెకు పాక్ వ్యక్తిని ప్రేమించడం, ఆమెను అక్కడ సాదరంగా ఆహ్వానించడం, అనంతరం జరిగిన పరిణామాల ను గమనిస్తుంటే కొత్త అనుమానం కలుగుతుందని అంటున్నారు మంత్రి!

అవును... పాకిస్థాన్‌ ప్రియుడి ని వివాహమాడేందుకు ఇస్లాం లోకి మారిన భారతీయ మహిళ అంజూ వ్యవహారం ఓ అంతర్జాతీయ కుట్ర అని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా అభివర్ణించారు. ఈ సందర్భంగా అంజూ వ్యవహారం పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అంజూ పెళ్లి వ్యవహారం లో తాజా పరిణామాల పై ఆయన మాట్లాడిన ఆయన... "ఆమె సరిహద్దులు దాటి వెళ్లడం.. అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటం.. అంజూను పాకిస్థాన్‌ లోకి ఆహ్వానించిన తీరు.. అక్కడ ఆమెకు అందిన ఖరీదైన బహుమతులు.. చూస్తుంటే ఇందు లో కుట్రకోణం ఉందేమోనన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి" అని పేర్కొన్నారు.

మరోవైపు తన నుంచి ఇప్పటి వరకు విడాకులు పొందలేదని భారత్‌ లోని అంజూ భర్త చెబుతున్నాడు. ఈ దంపతుల కు 15 ఏళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం పై అంజూ తండ్రి గయాప్రసాద్‌ థామస్‌ స్పందిస్తూ.. "నా కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నాను.. తన బిడ్డల జీవితాన్ని నాశనం చేసింది.. భర్తకు విడాకులిచ్చి ఉండాల్సింది.. మా దృష్టిలో ఆమె బతికి లేదు" అని పేర్కొన్నారు.