Begin typing your search above and press return to search.

భారత్ రానున్న పాక్ పోయిన అంజు... కారణం ఇదేనట! /

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌ బుక్‌ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   30 Oct 2023 8:14 AM GMT
భారత్  రానున్న పాక్  పోయిన అంజు... కారణం ఇదేనట! /
X

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌ బుక్‌ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. అక్కడ విందులూ, వినోదాలతో ఆమె లైఫ్ హ్యాపీగానే ఉందని తెలుస్తుంది. అయితే అప్పటికే పెళ్లైన ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆమె తిరిగి ఇండియాకు రావాలనుకుంటుందంట.

అవును... ఈ పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉండి కూడా ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తికోసం ఈ ఏడాది జూలై నెలాఖరున పాకిస్థాన్ పారిపోయిన అంజూ అనే మహిళ... తిరిగి ఇండియాకు రావాలనుకుంటుందంట. అలా అని ఆమెకు ఇండియాలో ఆన్ లైన్ లో మరో వ్యక్తి పరిచయం అయ్యాడా.. లేక, పాక్ లోని ప్రియుడితో కలహాలు వచ్చాయో అని అనుకుంటే పొరపాటే! అందుకు వేరే కారణం ఉంది!

పాకిస్థాన్‌ లోని ఫేస్‌ బుక్‌ స్నేహితుడి కోసం ఆ దేశం వెళ్లి అతడినే పెళ్లాడిన భారత్‌ కు చెందిన వివాహిత అంజు.. భారత్‌ కు రావాలని భావిస్తోంది. ఈ విషయాలను ఆమె పాకిస్థాన్ భర్త నస్రుల్లా వెల్లడించాడు. పాక్‌ ప్రభుత్వం నుంచి నాన్ అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌.వో.సీ) రాగానే ఆమె భారత్‌ లో పర్యటిస్తారని అతడు తాజాగా వెల్లడించాడు.

భారత్ లో గల తన ఇద్దరు పిల్లలను ఆమె చూడాలనుకుంటుందని, ఒకసారి ఇండియాకు వెళ్లి వారిని కలుసుకోవాలని భావిస్తుందని.. దీంతో ఇప్పటికే ఎన్‌.వో.సీ కోసం ఇస్లామాబాద్‌ లోని హోంశాఖకు దరఖాస్తు చేశామని నస్రుల్లా తెలిపాడు. ఇండియాలో గల తన ఇద్దరు పిల్లలను కలుసుకుని తిరిగి అంజు పాకిస్థాన్‌ కు చేరుకుంటుందని అన్నాడు.

కాగా... ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్స్‌ లోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు చెందిన నస్రుల్లా (29)ను గత జులై 25న అంజు (34) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతడి కోసమే ఆమె భర్త, పిల్లలను వదిలి పాక్ కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నస్రుల్లాతో వివాహానికి ముందు ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు.

ఈ క్రమంలో ఆగస్టులో ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏడాది కాలంపాటు చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసింది. ఈ వ్యవహారానికి ముందు రాజస్థాన్‌ కు చెందిన అర్వింద్‌ తో ఆమెకు వివాహం జరిగింది. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై నెలాఖరున ఫేస్ బుక్ లో పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్థాన్ పారిపోయింది! తాజాగా ఒకసారి పిల్లలను చూసివెళ్లడానికి ఇండియా రావడానికి ప్రయత్నిస్తుంది!