Begin typing your search above and press return to search.

కారు మోడ్ ఎంతపని చేసింది... మహిళా సీఈఓ దుర్మరణం!

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు షాకింగ్ గా ఉండగా.. ఆమె మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2024 9:00 AM GMT
కారు మోడ్  ఎంతపని చేసింది... మహిళా సీఈఓ దుర్మరణం!
X

మనిషికి మరణం ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో చెప్పడం ఎవరితరం కాదని అంటుంటారు. ఈ క్రమంలోనే పొరపాటున కారు మోడ్ ని మార్చడంతో జరిగిన అనూహ్య ప్రమాదంలో ఒక మహిళా సీఈఓ మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు షాకింగ్ గా ఉండగా.. ఆమె మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని రిచ్చెస్ట్ ఫ్యామిలీస్ లో ఒకటైన చావో కుటుంబానికి చెందిన ఏంజెలా (50) ఊహించని రీతిలో మృతి చెందారు! అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాప్టలిస్ట్ జిం బ్రెయార్ భార్య.. యూఎస్ మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సొదరి అయిన ఏంజెలా.. ప్రస్తుతం ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్ మోస్ట్ గ్రూప్ కు సీఈఓగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లోని ఫ్రెండ్స్ తో కలిసి టెక్సాస్ లోని ఆస్టిన్ కి సమీపంలో గల తన ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. సుమారు 900 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ప్రైవేట్ గెస్ట్ హౌస్ గుండానే మిల్లర్ సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె ఓ రెస్టారెంట్ లో గడిపి తిరిగి మెయిన్ బిల్డింగ్ కి బయలుదేరారు.

ఈ సమయంలో మార్గమధ్యలో ఒక త్రీపాయింట్ టర్న్ రావడంతో ఏంజెలా పొరపాటున తన టెస్లా ఎక్స్ ఎస్.యూ.వీ. కారును రివర్స్ మోడ్ లోకి మార్చారు. దీంతో ఆ కారును వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలనులో బోల్తాపడిపోయింది. దీంతో వెంటనే ఆమె భయంతో తన స్నేహితురాలికి ఫోన్ చేశారు. ఈ సమయంలో వాహనం తిరగబడటంతో నీటిలో వేగంగా మునిగిపోయింది.

ఈ సమయంలో ఆమె ఫ్రెండ్స్, గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ఆ కారు అద్దాలు బలంగా ఉండటంతో బ్రేక్ చేయడానికి వీలుకాలేదని అంటున్నారు. అనంతరం మరో వాహనం సాయంతో కారును నీటి నుంచి బయటకు తీయగా... అప్పటికే ఏంజెలా మృతిచెందింది! దీంతో... ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.