జంపింగ్స్ అపుడేనా...వైసీపీలో హాట్ హాట్ గా...?
సో వైసీపీ నుంచి వెళ్లే నంబర్ భారీగా ఉంటుందా లేక సింగిల్ డిజిట్ తో తెగిపోతుందా అంటే అది జగన్ చేసే సర్దుబాటు
By: Tupaki Desk | 27 Sep 2023 9:28 AM GMTఏపీలో ఎన్నికల వేడి ఎటూ ఉంది. విపక్షాలు దాన్ని బాగానే రాజేస్తున్నాయి. దానికి అనుగుణంగానే అధికార పార్టీ కూడా స్పీడ్ పెంచుతోంది. జగన్ గడప గడపకు కార్యక్రమాన్ని రివ్యూ చేస్తూ గేర్ మార్చాలి అని చెప్పడం విధితమే. ఇంకో వైపు చూస్తే తనను నమ్ముకున్న వారిని బాగా చూసుకుంటాను అని జగన్ చెబుతున్నారు.
జగన్ చెప్పడం కాదు చేసి చూపిస్తారు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఎవరికైనా హామీ ఇచ్చారు అంటే మాత్రం కచ్చితంగా వారికి టికెట్ ఇవ్వకపోయినా మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాయంగా పదవి దక్కుతుంది. జగన్ ఈ విషయంలో చెప్పాల్సింది చెబుతారు. చేయాల్సింది చేస్తారు.
ఆయన వద్ద రెండవ మాట వెనకాల మాట ఉండదని అంటారు. తాను టికెట్ ఇవ్వను అంటే ఇవ్వరంతే. అలాగే హామీ ఇచ్చి ఏదైనా పదవి ఇవ్వాలని జగన్ అనుకున్నా వారు మరచిపోవచ్చు కానీ జగన్ మాత్రం గుర్తు పెట్టుకుని ఇస్తారు. ఇపుడు ఇదే వైసీపీలో హాట్ టాపిక్ గా సాగుతోంది.
టికెట్ రాకపోతే జగన్ ఇచ్చే పదవుల హామీని తీసుకుని పార్టీలో కొనసాగాలని అనుకున్న వారు కూడా ఉన్నారు. అదే టైం లో మిగిలిన పార్టీలలో ఈ చివరి నిముషంలో జంప్ చేసి అక్కడ కూడా హామీనే పొందగలమని, అయితే అక్కడ హామీ తీర్చే పరిస్థితి ఎంతవరకూ ఉంటుందో ఎవరికీ తెలియదు అన్నది కూడా వైసీపీ లోని చాలా మందిలో చర్చకు వస్తోంది.
అదే విధంగా చూస్తే జగన్ టికెట్ నో అన్న వారిలో ఎక్కువ మంది ఒకలా ఆలోచిస్తూంటే మరి కొంతమంది వేరే విధంగానూ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వారికి ప్రత్యర్ధి పార్టీల నుంచి టికెట్ హామీ ఉంటే కనుక జంప్ కి వెనకడుగు వేయకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది రాజకీయం. ఎప్పటికపుడే తేల్చేసుకోవాలి. భవిష్యత్తు అని కూర్చుంటే కుదిరే వ్యవహారం కాదు.
దాంతో జగన్ టికెట్లని నో చెబితే ఏమి చేయాలన్న దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అంటున్నారు. ఇక జగన్ నోటి నుంచి రావాలి అని వెయిట్ చేయాలనుకుంటే ఏమో కానీ ఎవరి మటుకు వారికి తమ టాలెంట్, తన పని తీరు సర్వేలు, అధినాయకత్వం వద్ద తమకు పడే మార్కులు ఇవన్నీ బేరీజు వేసుకుంటున్న వారు మాత్రం టికెట్ రాదు అని డిసైడ్ అవుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి.
ముందు చూపు కాస్తా ఉన్న వారు అయితే ప్రత్యర్ధి పార్టీలకు టచ్ లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నిటికంటే జనసేనలో అవకాశాలు ఉంటే ఆ వైపుగా వెళ్లాలని ఆలోచిస్తున్న వారూ ఉన్నారు. ఇంకో వైపు చూస్తే ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో కొన్ని చోట్ల సీట్లు దక్కని వారు ఈసారి ఉంటారని అంటున్నారు. రాయలసేమ నాలుగు జిల్లాలలలో తక్కువ మార్పులే ఉంటాయని తెలుస్తోంది.
దాంతో పాటు టికెట్ కన్ ఫర్మ్ గా రాదు అని అంచనా వేసుకుంటున్న వారు అయితే ఇది కీలక టైం అని నమ్ముతున్నారు. దాంతో వారు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని బిగిన్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇక చూస్తే శీతాకాల సమావేశాలు అయితే డిసెంబర్ లో జరగాలి. కానీ అవి పెద్దగా జరిగే అవకాశాలు లేవు అని అంటున్నారు. అంటే ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి అనుకుంటే కనుక మార్చిలోపల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉంటుందని అంటున్నారు.
అది చూసుకుని ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుంది. అందువల్ల ఒక విధంగా చూసుకుంటే ఈ వర్షాకాల సమావేశాలే ఏ రకమైన చర్చకలు అయినా దాదాపుగా చివరిని అని భావించాల్సి ఉంటుంది. సో ఎమ్మెల్యేలు ఒక రకంగా ఇపుడు ఫ్రీ బర్డ్స్ గానే ఉంటారు అని అంటున్నారు.
మరో మూడు నెలలలో తెలంగాణా ఎన్నికలు ఉన్నాయి. వాటి ఫలితాలు కూడా చూసుకుని ఏపీలో పొత్తుల వ్యవహారం చూసుకుని మారిన రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుంటే 2024 కొత్త ఏడాది నుంచే వైసీపీలో ఇమడలేని వారు జంపింగ్స్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. సో వైసీపీ నుంచి వెళ్లే నంబర్ భారీగా ఉంటుందా లేక సింగిల్ డిజిట్ తో తెగిపోతుందా అంటే అది జగన్ చేసే సర్దుబాటు ని బట్టి అలాగే అధినాయకత్వం నుంచి ఎమ్మెల్యేలకు వచ్చే హామీల బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు.