Begin typing your search above and press return to search.

మార్చి 6న ఏపీలో ఎన్నికలు..!?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చిలోనే జరుగుతాయా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. హడావుడి కూడా అదే తీరున ఉంది. ఏపీలో మార్చి 6న ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 4:06 PM GMT
మార్చి 6న ఏపీలో ఎన్నికలు..!?
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చిలోనే జరుగుతాయా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. హడావుడి కూడా అదే తీరున ఉంది. ఏపీలో మార్చి 6న ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు వేగంగా జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఎందుకంటే లోక్ సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఏపీ ఒడిశా సిక్కిం లాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి కూడా ఆరేడు దశలలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అంటే అది అతి పెద్ద ఎక్సర్ సైజ్ చేయల్సినదిగా ఉంటుంది.

దాంతో తొలి విడతలోనే ఏపీ ఒడిషా సిక్కిం వంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఫస్ట్ ఫేజ్ ని జరిపించడం ద్వారా ఈసీ పెను భారాన్ని ముందే తగ్గించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

ఈ విధంగా ఈసీ ఆలోచనలు ఉంటే కనుక ఫిబ్రవరి 2న ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం గా ఉంది. ఇక అధికారిక సమాచారం ఏదీ బయటకు లేకపోయినప్పటికీ గత ఎన్నికల కంటే కూడా ఈసారి ఒక నెల ముందు ఎన్నికల షెడ్యూల్ జరిపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది.

గతసారి అంటే 2019లో ఏప్రిల్ 11 నుంచి తొలిదశ ఎన్నికలు మొదలై మే మూడవ వారం వరకూ సుదీర్ఘంగా ఏడు విడతలుగా కొనసాగాయి. ఈసారి ఆ విధంగా కాకుందా ఏప్రిల్ నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ ముగించేలా ఈసీ సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇక గతసారి ఏడు విడతలుగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈసారి అది కాస్తా ఎనిమిది విడతలుగా మారవచ్చు అని కూడా అంటున్నారు. అలా కనుక చూసుకుంటే మార్చి మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలెట్టి ఏప్రిల్ నెలాఖరు వరకూ దాన్ని కొనసాగించేలా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ తో ఈసీ ఉంది అని అంటున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే ఏపీ తెలంగాణా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను మొదటి విడతలో జరిపించడానికి ఈసీ చూస్తోంది అని కూడా టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే ఫిబ్రవరి 2న ఎన్నికల ప్రకటన చేసి ఫిబ్రవరి 9 10 తేదీలలో నామినేషన్లను స్వీకరించే కార్యక్రమం మొదలెడతారు అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 9 10 తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీని మరోసారి పర్యటిస్తుంది అని అంటున్నారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధతను చూడడంతో పాటు ఏపీకి చెందిన ఎన్నికల అధికారుల బృందంతో కీలక చర్చలు సమావేశాలు జరుపుతారు అని అంటున్నారు.

ఇక ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఏపీలో మొత్తం ఓటర్లు మూడు కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఉన్నారు అని తెలుస్తోంది. అలాగే ఇందులో మహిళలు కోటీ 86 లక్షలు ఉంటే పురుష ఓటర్లు కోటీ 83 లక్షలు ఉన్నారని తెలుస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎన్నికలు ముందుకు తోసుకురావడం పట్ల రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒక నెల ముందుకు ఎన్నికలు తోసుకుని రావడం వల్ల ఎవరికి లాభం ఎవరికి ఇబ్బంది అన్న చర్చ కూడా సాగుతోంది.