Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన...బీజేపీ ఎక్కడ...?

మరి ఆ తరువాత బీజేపీ నుంచి ఏ మేరకు సహాయం విపక్షానికి అందింది అంటే జవాబు అయితే లేదు అనే అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 6:27 PM IST
వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన...బీజేపీ ఎక్కడ...?
X

ఏపీ రాజకీయాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. అలా బీజేపీకి ఏపీలో ఎవరు ఏమిటి అన్నది కళ్లకు కట్టినట్లుగా చంద్రబాబు అరెస్ట్ చూపించింది అని అంటున్నారు. బీజేపీకి బాబు లేని టీడీపీ వ్యవహారం ఏంటో కూడా తెలిసి వచ్చేలా చేసింది అని అంటున్నారు. ఇక మిత్రుడు అనుకున్న జనసేన కీలక సమయంలో టీడీపీకి మద్దతుగా నిలవడం కూడా బీజేపీని ఆలోచించేలా చేసింది.

ఏపీలో చూస్తే బీజేపీ ఇప్పటికీ న్యూట్రల్ స్టాండ్ తీసుకునేలా సీన్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీకి అలాగే విపక్ష కూటమికి కూడా దగ్గరగా కానీ దూరంగా కానీ లేకుండా ఒక వ్యూహాత్మకమైన తటస్థ విధానం అవలంబిస్తోంది అంటున్నారు.

ఏపీలో చంద్రబాబు జైలులో ఉండడం వల్ల టీడీపీ ఇబ్బందులు పడుతోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ మేరకు సాయం చేసింది అంటే ఏమీ లేదు అని జవాబు వస్తోంది. ఢిల్లీలో దాదాపుగా పాతిక రోజులకు పైగా ఉన్న నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ఎట్టకేలకు మీట్ కాగలిగారు. ఆయనకు తన తండ్రి అరెస్ట్ అక్రమం అని చెప్పుకున్నారు. టీడీపీని ప్రత్యేకించి తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోందని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.

ఇది జరిగి కూడా దాదాపుగా ఇరవై రోజులు కావస్తోంది అని అంటున్నారు. అయితే ఈ ఇరవై రోజులలో ఏ రకమైన ప్రోగ్రెస్ అయితే లేదు. అమిత్ షా అన్నీ విన్నారని విచారణ వివరాలు అడిగి తెలుసుకున్నరని టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. మరి ఆ తరువాత బీజేపీ నుంచి ఏ మేరకు సహాయం విపక్షానికి అందింది అంటే జవాబు అయితే లేదు అనే అంటున్నారు.

ఇంకో వైపు జనసేన మిత్రపక్షం అని చెబుతున్నా పవన్ కి ఈ రోజుకీ కేంద్ర పెద్దల నుంచి అపాయింట్మెంట్ అయితే లేదు. దాంతో కేంద్ర బీజేపీ ఏపీ పాలిటిక్స్ ని అలా దూరం నుంచి చూస్తూ వస్తోందని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీకి ఇపుడు అర్జంట్ గా తెలంగాణా ఎన్నికలు సహా దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలే ముఖ్యం.

ఆ ఎన్నికలలో మెజారిటీ స్టేట్స్ ని గెలవాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. దాని కోసమే బీజేపీ పనిచేస్తోంది. అందువల్ల ఏపీ విషయం బీజేపీకి ఇప్పటికి అప్రస్తుతం అని అంటున్నారు. దాంతో ఏపీలో విపక్షానికి పూర్తిగా బీజేపీ అండ అన్నది లేకుండా పోయిందా అన్న చర్చ వస్తోంది. అయితే చంద్రబాబు కేసు పూర్తిగా కోర్టు పర్ధిలో ఉన్న విషయం అని అంటున్నారు.

దాంతో బీజేపీ ఏ విధంగా సాయం చేయగలదు అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అయితే నైతిక మద్దతు అయినా ఇవ్వవచ్చు కదా అన్నది ఇంకో ప్రశ్న. కానీ బీజేపీ ఏపీలో విపక్షం తీరుతెన్నులను చూస్తోంది. బాబు అరెస్ట్ తరువాత సానుభూతి వర్కౌట్ కాలేదని, అలాగే జనసేన తీసుకున్న పొలిటికల్ స్టాండ్ మీద కూడా జనంలోనూ సొంత పార్టీలోనూ ఊహించినంతగా రెస్పాన్స్ లేదని అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తున్న మీదటనే బీజేపీ వెయిట్ అండ్ సీ అన్న వైఖరితోనే ఉంది అని అంటున్నారు. రానున్న రోజులలో ఏమైనా కీలకమైన పరిణామాలు జరిగితేనే తప్ప బీజేపీ ఇదే స్టాండ్ తో ఉంటుందని కూడా అంటున్నారు.