Begin typing your search above and press return to search.

దేశంలో సంపన్నమహిళా ఎంపీల్లో ఏపీదే మొదటి స్థానం

మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఒక తేడా ఉంది. సాధారణంగా సంపన్న రాష్ట్రన్నంతనే ఆ రాష్ట్ర చట్టసభ సభ్యులు సంనన్నులుగా ఉండటం కనిపించదు.

By:  Tupaki Desk   |   1 May 2025 9:32 AM IST
దేశంలో సంపన్నమహిళా ఎంపీల్లో ఏపీదే మొదటి స్థానం
X

మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఒక తేడా ఉంది. సాధారణంగా సంపన్న రాష్ట్రన్నంతనే ఆ రాష్ట్ర చట్టసభ సభ్యులు సంనన్నులుగా ఉండటం కనిపించదు. అందుకు భిన్నమైన సీన్ ఏపీలో కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిని చూస్తే అయ్యో అనిపించేలా ఉండే అప్పులు కనిపిస్తాయి. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆస్తులు చూస్తే కళ్లు చెదరక మానదు. తాజాగా ఇదే అంశం మరో రూపంలో బయటకు వచ్చింది. దేశంలో అత్యధిక సంపన్న మహిళా ఎంపీల్లో ఏపీ టాప్ ప్లేస్ లో నిలవటం విశేషం.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ పలు ఆసక్తికర అంశాలతో కూడిన నివేదికను వెల్లడించింది. లోక్ సభలోని 75 మంది మహిళా ఎంపీల్లో సంపన్నులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మన చట్టసభల్లో బిలియనీర్లకు కొదవ లేదు.

లోక్ సభలోని 75 మంది మహిళా ఎంపీల్లో ఆరుగురు.. 37 మంది రాజ్యసభ సభ్యురాళ్లలో ముగ్గురు.. వివిధ రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీల్లోని 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది బిలియనీర్లుగా ఈ రిపోర్టు వెల్లడించింది. యావత్ దేశంలోని అన్ని చట్టసభల్లో మొత్తం 513 మంది మహిళలు సభ్యులుగా ఉండగా.. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.10,417 కోట్లుగా తేల్చారు.

అంటే.. మొత్తం చట్టసభల్లోని మహిళా ప్రజాప్రతినిధుల సరాసరి ఆస్తి రూ.20.34 కోట్లు ఉంటే.. ఏపీ మహిళా ప్రజాప్రతినిధుల వ్యవహారం మరోలా ఉంది. ఏపీకి చెందిన మహిళా చట్టసభ సభ్యుల సరాసరి ఆస్తి రూ.74.22 కోట్లు ఉండటం గమనార్హం. దేశంలోని మొత్తం మహిళా ప్రజాప్రతినిధుల్లో 143 మంది (మొత్తంలో 28 శాతం మంది) క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు.

లోక్ సభలో మొత్తం 75 మంది మహిళా ఎంపీలు ఉంటే.. వారిలో 32శాతం మంది అంటే.. 24 మంది.. రాజ్యసభలోని 37 మందిలో 27 శాతం అంటే.. 10 మంది నేరారోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఇక.. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎమ్మెల్యేలు 400 మంది కాగా.. వారిలో 27 శాతం మంది అంటే.. 109 మంది నేరారోపణల్ని ఎదుర్కొనటం గమనానర్హం. మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేల్లో 78 మంది హత్య.. హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లుగా నేరారోపణలు ఉండటం విశేషం.

నేరారోపణలున్న మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గణాంకాలు విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి. తెలంగాణకు చెందిన 12 మంది మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేల్లో ఐదుగురు (42 శాతం) మీద తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఇక.. ఏపీ విషయానికి వస్తే మొత్తం 24 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 9 మంది (38 శాతం) మీద తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఈ విషయాల్ని ఆయా సభ్యులు తమ అఫిడవిట్లలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేశారు.

పార్టీల వారీగా చూస్తే.. బీజేపీకి మొత్తం 217 మంది మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ కు 83 మంది మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మహిళా ఎంపీ.. ఎమ్మెల్యేల్లో 23 శాతం మంది మీద నేరాభియోగాలు ఉంటే.. వారిలో 11 శాతం మంది మీద తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 34 శాతం మంది నేర అభియోగాలు ఉంటే.. 20 శాతం మంది మీద తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.

టీడీపీకి మొత్తం 20 మంది చట్టసభల్లో మహిళా సభ్యులు ఉంటే.. వారిలో 65 శాతం మంది మీద నేరారోపణలు.. 45 శాతం మీద తీవ్ర నేరారోపణలు ఉండటం గమనార్హం. ఆమ్ ఆద్మీకి చెందిన 13 మంది మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేల్లో 69 శాతం మీద నేరారోపణలు.. 31 శాతం మంది మీద తీవ్రనేరారోపణలు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.

దేశంలోని మహిళా ఎంపీల్లో 64 శాతం మంది 41-60 ఏళ్ల వయస్కులు కాగా.. 22 శాతం మంది మాత్రం 25-40 ఏళ్లు వారుగా తేలింది. 14 శాతం మంది 61-80 ఏళ్ల మధ్యలో ఉన్నారు. మొత్తంగా చట్టసభల్లో మహిళా సభ్యుల సరాసరి వయసు 49 ఏళ్లు. దేశంలోని మహిళా ఎంపీలు.. ఎమ్మెల్యేల్లో 71 శాతం మంది గ్రాడ్యుయేషన్ లేదంటే అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు. 24 శాతం మాత్రం ఐదు నుంచి ప్లస్ టూ వరకు చదువుకున్నవారు ఉన్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. దేశంలోనే అత్యధిక మహిళా ఎంపీలు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 11 మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ..మహారాష్ట్రల నుంచి 7గురు చొప్పున, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు ఎంపీలు ఉన్నారు.