Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీగా ఏయూ...అద్వితీయ ఆతీధ్యం

విశాఖలో ఇప్పటికి వందేళ్ళ క్రితం ఏర్పాటు అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనత ఎంతో మాటలలో చెప్పలేరు.

By:  Satya P   |   27 April 2026 3:53 PM IST
ఏపీ అసెంబ్లీగా ఏయూ...అద్వితీయ ఆతీధ్యం
X

విశాఖలో ఇప్పటికి వందేళ్ళ క్రితం ఏర్పాటు అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనత ఎంతో మాటలలో చెప్పలేరు. ఏయూ కీర్తి ప్రతిష్టలు బహుముఖీయంగా ప్రకాశిస్తూనే ఉంటున్నాయి. అవి ఇంకా దేదీప్యమానమై వెలుగొందుతున్నాయి. ఏయూ చరిత్ర గురించి తెలుసుకుంటే ఎన్నో విషయాలు వెలుగు చూస్తాయి. అవి మధుర జ్ఞాపకాలుగా నిలిచి మదిని పులకరింపచేస్తాయి. ఏయూ ఎంత గొప్పది అంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆతీధ్యం ఇచ్చింది. అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇవి ఏయూ ప్రతిష్టను పెంచే మేలు మెరుపులుగా అంతా చూస్తున్నారు. ఏయూ వందేళ్ళ వేడుక వేళ వీటిని మరోసారి తలచుకుని అంతా మురిసిపోతున్నారు.

మొదటి బడ్జెట్ సమావేశం:

ఆంద్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న కర్నూల్ రాజధాని గా ఏర్పడింది. ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రధాని పండిట్ నెహ్రూ స్వయంగా కర్నూల్ వచ్చి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇక కర్నూల్ లో చిన్న భవనాలలో రాజధాని కొనసాగుతూండేది. ఈ నేపధ్యంలో 1954లో రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్ సెషన్ ని నిర్వహించాల్సి వచ్చింది. రాయలసీమలో అప్పటికే వేసవి ఎండలు విపరీతంగా ఉన్నాయి. దానికి తోడు ఎక్కువ రోజుల పాటు బడ్జెట్ సెషన్ కొనసాగాల్సి ఉంది. దాంతో నిర్వహణ సదుపాయాలు భవనాలు అన్నీ దృష్టిలో ఉంచుకుని విశాఖలో 1954 మే నెలలో విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వంలో నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూలోని టిఎల్ఎన్ సభా హాలులో జరిగింది. అలా విశాఖ సాగర తీరంలో చల్లని వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు పూర్తి అహ్లాదభరితమైన వాతావరణంలో సాగాయి. విశాఖ రాజధాని అన్న భావనకు తొలిసారి ఒక ముద్ర బలంగా పడింది. అంతే కాదు ఏయూ ఆంధ్ర బడ్జెట్ సమావేశాలకు ఆతీధ్యం ఇవ్వడం అన్నది ఒక కీలక ఘట్టంగా చెప్పుకుంటారు.

మరోసారి అక్కడే :

అంతే కాదు ఏయూ వేదికగా ఇంకోసారి ఆంధ్ర రాష్ట్రానికి ఆతీధ్యం ఇచ్చింది. ఆ సందర్భం ఏమిటి అంటే 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాయి. దాంతో ఆంధ్రాకు అనివార్యంగా పాలన తరలిరావడం జరిగింది. ఏపీలో మంత్రివర్గ సమావేశం నిర్వహించుకోవడానికి అప్పటికి సరైన సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం విశాఖలోని ఏయూ క్యాంపస్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అన్నీ తీసుకున్నారు. ఇలా చూస్తే కనుక ఏపీ ఏపీ రాష్ట్ర ప్రగతిలోనూ అభివృద్ధిలోనూ పాలనలోనూ అత్యంత ముఖ్య భూమిక పోషించింది అని చెప్పాల్సి ఉంది.