Begin typing your search above and press return to search.

కూటమికి త్రిమూర్తులు

అదే నిజం కూడా. కానీ అలా కాదు కూటమిలో ఇంకా ముఖ్యులు మరో ఇద్దరు ఉన్నారు వారే చంద్రబాబు రాజకీయ వారసుడు, మంత్రి అయిన నారా లోకేష్. అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

By:  Tupaki Desk   |   13 Jun 2025 10:00 PM IST
కూటమికి త్రిమూర్తులు
X

ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. కూటమికి పెద్ద ఎవరు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అనే చెప్పుకోవాలి. అదే నిజం కూడా. కానీ అలా కాదు కూటమిలో ఇంకా ముఖ్యులు మరో ఇద్దరు ఉన్నారు వారే చంద్రబాబు రాజకీయ వారసుడు, మంత్రి అయిన నారా లోకేష్. అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఈ ఇద్దరూ కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి సౌండ్ ఉంది దాంతో పవన్ కళ్యాణ్ కూటమిలో ప్రాధాన్యత కలిగిన నాయకుడు అనే చెప్పాల్సి ఉంది. పైగా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ఆయన చేసినది చాలానే ఉంది అన్నది తెలిసిందే.

ఇక మరో నేత నారా లోకేష్. ఆయన భావి సీఎం గా టీడీపీలో పిలిపించుకుంటున్నారు. దాంతో ఆయన కూడా కూటమి సారధులలో ఒకరుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కూటమి ఏడాది సుపరిపాలన పేరుతో విడుదల అయిన అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటిలోనూ ఈ ముగ్గురు ఫోటోలు కనిపిస్తున్నాయి.

నిజానికి గత ఏడాది నుంచి చూస్తే కూటమి అంటే ఒక వైపు చంద్రబాబు మరో వైపు నరేంద్ర మోడీ అలాగే పవన్ కళ్యాణ్ కనిపించేవారు. అలాగే ఉండాలని అన్న వారూ ఉన్నారు ఎందుకంటే కూటమిలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ అధినాయకుడిగా కేంద్రంలో బలమైన నేతగా ప్రభుత్వ సారధిగా ఉన్న నరేంద్ర మోడీ ఫోటో ఉండాల్సిందే కదా అన్నదే ఒక వాదన.

ఒక వేళ మోడీ జాతీయ నాయకుడు, ఏపీలో కూటమి నాయకులుగా మూడు పార్టీల అధ్యక్షులు ఉండాలని అనుకుంటే కనుక ఏపీ బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి ఫోటో కచ్చితంగా ఉండాలి. కానీ అవేమీ లేకుండా లోకేష్ పవన్ బాబులతో కూడిన ఫోటోలు రావడంతో చర్చ సాగుతోంది.

బీజేపీ కూటమిలో ఉన్నా ప్రాధాన్యత లేదా అన్న వారూ ఉన్నారు. అలా కాదు కూటమి అంటే ఈ ముగ్గురే బలమైన నాయకులు గా ఉన్నారు కాబట్టి వారి ఫోటోలే ఉండడం న్యాయమని అన్న వారూ ఉన్నారు నిజం చెప్పాలీ అంటే బీజేపీ అధినాయకుల ఫోటో కూటమి ప్రకటనలలో ఉండాలి. కానీ ఎక్కడా అది కనిపించకపోవడం పట్ల కమలనాధులు మాత్రం గుస్సా అవుతున్నారు.

అదే సమయంలో లోకేష్ కేవలం మంత్రిగానే ఉన్నారు కదా ఆయన ఫోటో ఎలా వచ్చింది అంటే లోకేష్ తొందరలోనే టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు కాబట్టి ఆయన బొమ్మ ఉండాల్సిందే అన్న లాజిక్ ఉంది. అంతే కాదు బాబుకు ఒక వైపు పవన్ ఉంటే మరో వైపు లోకేష్ ఫోటో లేకపోతే పొలిటికల్ బాలెన్స్ సరితూగదు అని అంటున్నారు.

ఏది ఏమైనా ఈ ఏడాది మొదలు నుంచే లోకేష్ ఫ్లెక్సీలలోనూ ప్రభుత్వ ప్రకటనలలోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు. విశాఖలో ప్రధాని మోడీ సభతో మొదలైన లోకేష్ ఫోకస్ ఆ తరువాత అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభ దాకా వచ్చేసరికి మరింతగా పైగింది తొలి ఏడాది పాలన పూర్తి తరువాత ఆయన త్రిమూర్తులలో ఒకరుగా అయ్యారు. సో ఇదన్న మాట మ్యాటర్. కూటమిని త్రిమూర్తులు నడిపిస్తున్నారు అన్నదే ఇపుడు అంతా చర్చించుకోవాల్సిన విషయమని అంటున్నారు.