Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి జంపింగులు ఇంకా ?

ఏపీలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ప్రధాన పార్టీలు మాత్రం కొన్నే ఉన్నాయి. అందులో మూడు అధికార కూటమిలో చేరిపోయాయి.

By:  Satya P   |   26 May 2026 3:00 PM IST
వైసీపీ నుంచి జంపింగులు ఇంకా ?
X

ఏపీలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ప్రధాన పార్టీలు మాత్రం కొన్నే ఉన్నాయి. అందులో మూడు అధికార కూటమిలో చేరిపోయాయి. టీడీపీ జనసేన బీజేపీ ఒక జట్టు కట్టాయి. ఒక అయిదేళ్ళ పాటు ఏపీని పాలించిన వైసీపీ విపక్షంలో ఉంది. విపక్షంలో చూస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఇవేమీ ఏపీలో బలమైన పరిస్థితులలో లేవు. ఉనికి పోరాటం చేస్తున్నాయి. దాంతో విపక్షంలో బలంగా 40 శాతం ఓటు షేర్ తో ఉన్న ఏకైక పార్టీగా వైసీపీ ఉంది. అదృష్టం కలిసి వస్తే మరోసారి అందలం ఎక్కే పార్టీ కూడా వైసీపీ అవుతుందని అంటున్నారు.

ఫిరాయింపు నేతలంతా :

ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నుంచి ఫిరాయింపు నేతలు పదుల సంఖ్యలో పార్టీని వీడిపోయారు. వారంతా కూడా కూటమి వైపు వెళ్ళారు. అలా తెలుగుదేశం బీజేపీ జనసేనలలో చేరిపోయారు. మరి కొంతమంది వైసీపీని వీడి ఏ పార్టీలో చేరకుండా పరిస్థితిని గమనిస్తున్నారు. ఇదంతా కూడా తొలి ఏడాదిలోనే జరిగిపోయింది. ఆ తరువాత చూస్తే వైసీపీ నుంచి పెద్దగా జంపింగులు అయితే లేవు. దానికి కారణం వైసీపీని వీడి వెళ్ళిన వారు కూటమి పార్టీలలో సరైన ప్రాధాన్యత పొందకపోవడం. కండువా కప్పుకున్న రోజు తప్ప నాటి నుంచి నేటి వరకూ ఎక్కడా పెద్దగా కనిపించకపోవడమే. దాంతో మిగిలిన వారు కూడా పునరాలోచనలో పడ్డారు అని అంటున్నారు.

రెండేళ్ళు దాటేసింది :

ఇక చూస్తే రెండేళ్ళ కూటమి పాలన ముగిసింది. మరొ రెండేళ్ళు గట్టిగా కాలం కదిలితే చాలు చివరి ఏడాది ఎన్నికలు వచ్చేస్తాయి. రెండేళ్ళ తరువాత మెల్లగా యాంటీ ఇంకెంబెన్సీ అన్నది మొదలవుతుంది. దాంతో జనాభిప్రాయం ఏమిటి అన్నది కూడా వెల్లడి అవుతుంది. దానిని గ్రహిస్తూ ముందుకు సాగే వైసీపీ నేతలు ఎవరూ ఇక గడప దాటేది ఉండదని వైసీపీ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు. వైసీపీలో ఉన్న వారు కూడా బయటకు వెళ్తే చేసేది ఏదీ లేదని కూడా ఒక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. ఇలా వైసీపీలో ఇపుడు ఉన్న నాయకులు అంతా కచ్చితంగా ఎన్నికల దాకా కొనసాగుతారు అని ధీమాగా వైసీపీ పెద్దలు ఉన్నారు.

అధినేత ఇమేజ్ తోనే :

ప్రాంతీయ పార్టీలు అన్నీ అధినేత ఫేస్ చూసి మాత్రమే మనుగడ సాగిస్తూ ఉంటాయి. అలా జగన్ ఇమేజ్ ని చూసే వైసీపీలో నేతలు ఉంటున్నారు అని అంటున్నారు వైసీపీ గ్రాఫ్ కూడా నెమ్మదిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నాయకులు భావిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అధినేత న్యాయం చేస్తారు అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. నిజానికి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా కొందరు బిగ్ షాట్స్ మాజీ మంత్రులు సీనియర్ నేతలు అంతా పార్టీని వీడాలని ఒకనొక సమయంలో నిర్ణయం తీసుకున్నా ఎందుక వెనకడుగు వేశారు. కొన్నాళ్ళ పాటు వారంతా మౌనంగా ఉన్నా ఇపుడిపుడే మీడియా ముఖం చూస్తున్నారు. ఆ విధంగా అధినేత కళ్ళల్లో పడి తాము యాక్టివ్ గా ఉన్నామని చెప్పుకోవడం ద్వారా వైసీపీలో అవకాశాలను అందుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అదే అడ్వాంటేజ్ :

ఏపీలో సరైన పోటీ ప్రతిపక్షం లేకపోవడమే వైసీపీకి ఒక విధంగా అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కూటమి కాకపోతే వైసీపీనే ఎంచుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు. దాంతో వైసీపీకి పెద్ద ఇబ్బంది లేకుండా పోతోంది అని అంటున్నారు ఇక వైసీపీలో కొనసాగుతున్నారని నాయకులకు పదవులు ఇచ్చే సీన్ ఉంటుందా అన్నది కూడా ఒక ప్రశ్న. పార్టీకి పనికి వచ్చే వారు ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు ఇస్తారని అంటున్నారు. జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు అందరూ పనిచేయడం చూశారు, అధికారంలో అయిదేళ్ళూ అంతా పార్టీలో హడావుడి చేయడమూ చూశారు, ఇపుడు విపక్షంలోకి వచ్చాక పార్టీని వీడి వెళ్ళిన వారు ఉన్నా సైలెంట్ గా గడిపిన వారినీ చూశారని అందువల్ల వైసీపీలో ఎవరు ఏమిటో జగన్ కి బాగా తెలుసు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ నుంచి భారీ జంపింగులు అయితే జరిగేది ఇక మీదట ఉండబోదు అన్న భరోసా అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.