రెడ్ బుక్ వర్సెస్ రప్పా రప్పా...రెండింట్లో ట్రెండింగ్!
రప్పా రప్పా అన్న డైలాగ్ ని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉత్తమ నటుడు అవార్డు తెలంగాణా ప్రభుత్వం నుంచి స్వీకరిస్తున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొట్టారు.
By: Tupaki Desk | 23 Jun 2025 1:44 PMఏపీలో రెడ్ బుక్ అన్నది గత ఏడాదిగా గట్టిగా వినిపిస్తోంది. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అని వైసీపీ గగ్గోలు పెడుతోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నేతలను కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లుగా అరెస్ట్ చేస్తున్నారు అని వేధిస్తున్నారు అని వైసీపీ మండిపడుతోంది.
రెడ్ బుక్ పేరు పెట్టి వైసీపీని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అవుతోంది. మేము కూడా అధికారంలోకి వస్తాం మేము ఒక బుక్ రాసి అందరి మీద ఇంతకు ఇంతా బదులు తీర్చుకుంటామని వైసీపీ పదునైన కౌంటర్ ఇస్తోంది. అయితే ఇదిలా ఉండగానే ఇటీవల జగన్ పల్నాడు టూర్ లో రప్పా రప్పా పేరుతో ఫ్లెక్సీ వెలసింది. దాంతో ఈ రప్పా రప్పా రాజకీయం ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. జగన్ నోటి వెంట సైతం రప్పా రప్పా అన్న మాటలు రావడంతో అసలేమిటి ఈ రెడ్ బుక్ ఏమిటి రప్పా రప్పా ఈ రెండింటిలో ఏది ఇపుడు ట్రెండింగ్ అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
ఇక ఏపీలో రెడ్ బుక్ అని లోకేష్ యువగళం పాదయాత్రలో అంటే ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఏడాది కూటమి పాలనలో మాత్రం రెడ్ బుక్ బాగా పాపులర్ అయింది. అది కాస్తా నేషనల్ మీడియాకి సైతం పాకింది. దాంతో లోకేష్ రెడ్ బుక్ ని నేషనల్ మీడియా ఫుల్ గా కవర్ చేస్తూ వచ్చింది.
ఇపుడు రప్పా రప్పా అన్నది ఏపీ పాలిటిక్స్ లో కొత్తగా వినిపిస్తోంది. అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన నాయకుడు, పదిహేనేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వారు అయిన వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రప్పా రప్పా అన్న డైలాగులు వినిపించడంతో ఇదిపుడు జాతీయ స్థాయిలో సరికొత్తగా ట్రెండింగ్ అవుతోంది అని అంటున్నారు.
పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో దుమ్ము రేపింది. అందులో హీరో పాత్రధారి డైలాగే ఈ రప్పా రప్పా అన్నది. విలన్ల మీద హీరో ఫైర్ అవుతూ వాడే డైలాగ్ ఇది. పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో దేశమంతా ఈ రప్పా రప్పా డైలాగ్ అందరికీ తెలుసు. ఇపుడు ఏపీ మాజీ సీఎం జగన్ నోటి వెంట ఈ డైలాగ్ రావడంతో నేషనల్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.
అంతే కాదు రప్పా రప్పా అన్నది ఇపుడు ఏపీలో రాజకీయ వేడికి కారణం కావడంతో ఫుల్ కవరేజ్ ఇస్తోంది. ఇక తెలంగాణాలో కూడా రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. దాంతో అక్కడ కూడా రప్పా రప్పా రాజకీయం సాగుతోంది.
రప్పా రప్పా అన్న డైలాగ్ ని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉత్తమ నటుడు అవార్డు తెలంగాణా ప్రభుత్వం నుంచి స్వీకరిస్తున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొట్టారు. సీఎం అనుమతి తీసుకుని ఈ డైలాగ్ ఆయన చెప్పినా అది ఆ సభలో రీ సౌండ్ చేసింది.
అది జరిగిన కొన్ని రోజులకు ఏపీలో ఏకంగా ఒక మాజీ సీఎం నోటి వెంట ఆ డైలాగ్ వచ్చింది. ఇపుడు చూస్తే తెలంగాణాకు ఆ డైలాగ్ పాకేసింది. దాంతో దేశమంతా రప్పా రప్పా అంటోంది. నేషనల్ చానల్స్ కూడా ఈ మధ్య రప్పా రప్పా డైలాగ్ మాజీ సీఎం కొట్టడం మీద డిబేట్ లు పెట్టాయి. చర్చ కూడా సాగింది.
దాంతో రెడ్ బుక్ ఏపీ అంటే అనుకుని దాని మీదనే ఫుల్ ఫోకస్ పెట్టిన నేషనల్ మీడియాకు ఇపుడు రప్పా రప్పా న్యూ ట్రెండింగ్ అయింది. దాంతో ఇపుడు ఎక్కడ చూసినా రప్పా రప్పా అన్న సౌండే వినిపిస్తోంది. ఈ గోలలో రెడ్ బుక్ బాగా వెనుకబడి పోయింది అని అంటున్నారు. అంటే ఏపీలో మరో నాలుగేళ్ళలో వైసీపీ అధికారంలోకి వస్తే కనుక రప్పా రప్పా అన్న మాట అని చర్చలు సాగిస్తున్నారు.
నిజానికి గత ఎన్నికలకు ఏడాది ముందు కూడా రెడ్ బుక్ మీద పెద్దగా చర్చ సాగలేదు. ఎపుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో నాటి నుంచే రెడ్ బుక్ మీద భారీ డిస్కషన్ మొదలైంది. ఇపుడు చూస్తే అది కాస్తా రప్పా రప్పాగా మారింది. వైసీపీ అధికారంలోకి రావాలన్నా కూడా ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది మరి ఇప్పటి నుంచే రప్పా రప్పా ట్రెండింగ్ లో ఉందంటే వైసీపీ నుంచి మరెన్ని కొత్త డైలాగులు వస్తాయో అవెంత రచ్చ చేస్తాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.