Begin typing your search above and press return to search.

జగన్ ని ముగ్గులోకి లాగుతున్న లోకేష్

అలా రోజురోజుకీ తన ప్రభావాన్ని పార్టీలో ప్రభుత్వంలో పెంచుకుంటూ వస్తున్న లోకేష్ జగన్ ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 11:00 AM IST
జగన్ ని ముగ్గులోకి లాగుతున్న లోకేష్
X

ఏపీలో రసవత్తరమైన రాజకీయం సాగుతోంది. ఏపీలో అందరూ యంగ్ లీడర్లే. అదే సమయంలో సీనియర్ మోస్ట్ లీడర్ గా చంద్రబాబు ఉన్నారు. ఆయన రాజకీయ అనుభవం పాటి వయసు లేని వారే ఏపీ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. అయితే చంద్రబాబే అందరికీ కేంద్ర బిందువుగా ఉన్నారు.

కూటమిలో బాబు సీఎం. పెద్దన్నగా ఉన్నారు. ఆయనకు వారసుడుగా కుమారుడు లోకేష్ ఉన్నారు. ఆయనకు తండ్రి ఆరాధ్య నాయకుడు అనడంలో సందేహం లేదు ఎందుకంటే అది సహజాతి సహజం. ఇక మిత్రపక్షం అయిన జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు కూడా చంద్రబాబు అంటే ఎంతో అభిమానం ఉంది. బాబు నాయకత్వాన్ని ఆయన ఎంతగానో ఇష్టపడతారు. ఆయన నుంచి నేర్చుకుంటామని కూడా ఎలాంటి భేషజం లేకుండా చెబుతారు.

చిత్రమేంటి అంటే విపక్ష నేత జగన్ కి కూడా బాబే కావాలని అంటున్నారు. జగన్ కూటమిలో చంద్రబాబునే విమర్శిస్తారు. ఆయన పేరే ఎత్తి మాట్లాడుతారు. చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన మీద ఫోకస్ చేయడం నాచురల్ అని అనుకున్నా వారసుడిగా కూటమిలో బలమైన నేతగా లోకేష్ ఉన్నారు. ఆయన రేపటి సీఎం అని అంతా అంటున్నారు.

అలా రోజురోజుకీ తన ప్రభావాన్ని పార్టీలో ప్రభుత్వంలో పెంచుకుంటూ వస్తున్న లోకేష్ జగన్ ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు. జగన్ ని ఆయన సవాల్ చేస్తూ వస్తున్నారు. అలాగే స్ట్రాంగ్ గానే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ జగన్ ని ఉద్దేశించి లోకేష్ ఎంతలా మాట్లాడినా జగన్ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ ఉండకపోవడమే ఆశ్చర్యకరం. ఈ మధ్యనే ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయికి ఇచ్చారు అన్న ఆరోపణలు నిరూపించాలని జగన్ కి ఓపేన్ చాలెంజ్ చేస్తున్నాను అని లోకేష్ ప్రకటించారు. లోకేష్ తన సవాల్ ని స్వీకరించాలని డిమాండ్ చేశారు.

అయితే దానికి జగన్ స్పందించలేదు. ఆయన ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ రియాక్టు అయ్యారు. ఆయన లోకేష్ కి ప్రతి సవాల్ చేశారు. అలా లోకేష్ సవాల్ కి జగన్ తన వారి చేత రియాక్ట్ అయ్యేలా చూశారు. తాజాగా అమరావతిలో మహిళలను కించపరుస్తారా అని జగన్ మీద ఒక రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేసూ లోకేష్ ట్వీట్ చేశారు. మహిళలతో పెట్టుకుంటే చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టం చేశారు.

ఇలా జగన్ ని ఎలాగైనా ముగ్గులోకి లాగాలని లోకేష్ చూస్తున్నారు కానీ జగన్ మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. తనకు అసలైన ప్రత్యర్థిగా ఆయన బాబునే చూస్తున్నారు. ఆయన పవన్ ని గురించి కానీ లోకేష్ గురించి కానీ పెద్దగా మాట్లాడడం లేదు. అవసరమైనపుడు పేరు ఎత్తకుండా పరోక్ష విమర్శలే చేస్తున్నారు.

అయితే టీడీపీ మాత్రం లోకేష్ తోనే జగన్ కి అన్నీ చెప్పిస్తోంది. ఆయననే ముందు పెట్టి జగన్ ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. బాబు ఇదివరకు జగన్ గురించి మాట్లాడేవారు. ఇపుడు ఆయన జగన్ పేరు ప్రస్తావించడం లేదు. మరో వైపు బస్తీ మే సవాల్ అని లోకేష్ అంటున్నారు. మరి జగన్ వర్సెస్ లోకేష్ అన్న పాలిటిక్స్ ఏపీలో ఎపుడు స్టార్ట్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. అది జరిగిన నాడు ఏపీ పాలిటిక్స్ లో అసలైన ట్విస్ట్ ఉంటుందని పాలిటిక్స్ కూడా వేరే లెవెల్ లోకి వెళ్తుందని అంటున్నారు.