Begin typing your search above and press return to search.

ఏపీలో ఈ 'గ్యాప్‌' ఇంతేనా... !

``రాష్ట్రంలో ప్రతిప‌క్షం ఉండి ఉంటే.. మ‌నం చెప్పుకొనేందుకు మ‌రింత ఎక్కువ‌గా అవ‌కాశం ఉండేది. కానీ.. ప్ర‌జ‌లే ప్ర‌తిపక్షం లేకుండా చేశారు.

By:  Garuda Media   |   28 Nov 2025 7:00 PM IST
ఏపీలో ఈ గ్యాప్‌ ఇంతేనా... !
X

ఏపీ రాజ‌కీయాల్లో నెల‌కొన్న `ప్ర‌తిప‌క్షం` గ్యాప్ ఇంతేనా? దీనిని ఫుల్ ఫిల్ చేసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేదా? వ‌చ్చినా .. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. అన్ని రాష్ట్రా ల్లోనూ.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉన్నాయి. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నాయి. కానీ.. ఏపీ విష‌యానికి వ‌స్తే మా త్రం ప్ర‌తిప‌క్షం వైసీపీ ఉన్నా.. వివిధ కార‌ణాల‌తో ఆ పార్టీ ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా క‌నెక్ట్ కావ‌డం లేదు. దీంతో గ్యాప్ పెరిగింది. అయితే.. ఎవ‌రికేంటి బాధ‌? అంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు విష‌యం.

``రాష్ట్రంలో ప్రతిప‌క్షం ఉండి ఉంటే.. మ‌నం చెప్పుకొనేందుకు మ‌రింత ఎక్కువ‌గా అవ‌కాశం ఉండేది. కానీ.. ప్ర‌జ‌లే ప్ర‌తిపక్షం లేకుండా చేశారు. సో.. మ‌న‌మే ఇప్పుడు ఆ పాత్ర కూడా పోషించాలి.`` అని ఇటీవల చంద్ర‌బాబు స్వ‌యంగా వ్యాఖ్యానించారు. అంటే.. ఆయ‌న ఉద్దేశంలో ప్ర‌తిప‌క్షం ఉండాల‌న్న ప్ర‌జాస్వా మ్య స్ఫూర్తి స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇది కేవ‌లం ప్ర‌భుత్వానికి మాత్ర‌మే చంద్ర‌బాబు అన్వ‌యించ‌లేదు. పార్టీకి కూడా అన్వ‌యించారు. నేత‌ల‌ను సైతం హెచ్చ‌రించారు.

''ప్ర‌శ్నించేవారు లేర‌ని .. మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే.. కుద‌ర‌దు!. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. నాకు కూడా అన్నీతెలుసు.'' అంటూ చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంటే .. పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హారాన్ని కూడా ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌తో లింకు పెట్టారు. ఇది మంచి ప‌రిణామ‌మే.. అయితే.. రాష్ట్రంలో 11 స్థానాల‌కే ప‌రిమిత‌మైన వైసీపీ త‌న పాత్ర‌ను పూర్తిగా పోషించేందుకు విముఖ‌త వ్య‌క్తం చేస్తోంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డుందో కూడా అర్ధం కాని ప‌రిస్థితిలో ఉంది.

క‌మ్యూనిస్టులు ఉన్నా.. వారి వాద‌న వారిదే త‌ప్ప‌.. ఆశించిన మేర‌కు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు అయితే రావ‌డం లేదు. ఇది రాజ‌కీయంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిప‌క్షాన్ని దూరం చేసింద‌న్న వాద‌న ఉంది. అయితే.. ఈ విష‌యా న్ని ప‌సిగ‌ట్టిన ప్ర‌భుత్వం పేప‌ర్లు స‌హా మీడియాలో వ‌స్తున్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై వ‌స్తున్న వివాదాల‌ను.. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. సో.. మొత్తంగా ఏపీలో అయితే.. ప్ర‌తిపక్షం లేద‌న్న గ్యాప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి ఇది ఇంతేనా? వైసీపీ పుంజుకుంటుందా? అనేది చూడాలి.