లిక్కర్ కేసులో గుచ్చి గుచ్చి ప్రశ్నలు
ఇక లిక్కర్ స్కాం లో కసిరెడ్డి రాజ్ ని ధనుంజయ్ రెడ్డిని, క్రిష్ణ మోహన్ రెడ్డిని అలాగే బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది.
By: Tupaki Desk | 31 May 2025 12:10 AM ISTగత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం భారీ ఎత్తున సాగిందని అది వేల కోట్ల విలువ చేసే స్కాం అని టీడీపీ కూటమి ప్రభుత్వం దాని మీద దర్యాప్తు జరిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేసి లోతుగానే విచారణ చేయిస్తోంది. ఇక లిక్కర్ స్కాం లో ఆధారాలు ఉన్నాయనుకున్న వారిని అరెస్ట్ చేసి మరీ వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తోంది.
మరి లిక్కర్ స్కాం లో ఏ ప్రశ్నలు వేస్తున్నారు. ఏ విధంగా వారి నుంచి జవాబులు రాబడుతున్నారు అన్నది ఆసక్తికరమైన విషయమే. దాంతో లిక్కర్ స్కాం విషయంలో విచారణ మీద కూడా ప్రచారం అయితే సాగుతోంది.
ఇక లిక్కర్ స్కాం లో కసిరెడ్డి రాజ్ ని ధనుంజయ్ రెడ్డిని, క్రిష్ణ మోహన్ రెడ్డిని అలాగే బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. ఇక లిక్కర్ స్కాం లో వసూల్ చేసిన డబ్బులను ఎందులో పెట్టుబడులు పెట్టారు ఎక్కడెక్కడ పెట్టారు అని కూడా విచారణ చేసింది అంటున్నారు.
అంతే కాదు ఖరీదైన కార్లు ఎవరి కోసం ఎ ఎనుకు కొన్నారు అని విచారణలో ప్రశ్నలు సంధించింది. ఇక నిందితులు 2019 నుంచి 2024 మధ్యలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేసింది. వాటి మీద కూడా ప్రశ్నలు సంధించింది.
ఇలా ఒక్కటేమిటి అనేక వివరాల కోసం ప్రశ్నల వర్షమే కురిపించింది. ఈ విధంగా లిక్కర్ స్కాం లో నిందితుల తొలి రోజు విచారణ చాలా లోతుగానే సాగింది అని అంటున్నారు. ఈ నలుగురిని వేరు వేరుగానే ఎనిమిది గంటల పాటు విచారించారు అని తెలిసింది. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది.
ఇదిలా ఉంటే ఈ స్కాం లో నలుగురి పాత్ర కీలకంగానే ఉందని సిట్ గుర్తించింది అని అంటున్నారు. పూర్తి ఆధారాలతోనే ఈ విచారణలో నిందితులకు ప్రశ్నలు సంధించినట్లుగా చెబుతున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు కొన్న ఆస్తులు వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు గురించి కూడా గుచ్చి గుచ్చి అడిగినట్లుగా చెబుతున్నారు.
ఇవన్నీ బ్యాంక్ ఖాతాలా ఆధారాలతోనే సిట్ అడిగినట్లుగా చెబుతున్నారు. ఇక నిందితులు ఆస్తులు కొన్నవి అలాగే ఇతరత్రా వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సిట్ వివరాలు సేకరించుకుని మరీ వారిని అన్నీ అడిగినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి సిట్ విచారణ కీలక దశకు చేరుకుంది అని అంటున్నారు. కస్టడీకి మరో రోజు టైం ఉండడంతో ఆ విచారణలో ఇంకెన్ని వివరాలు రాబడతారో చూడాలని అంటున్నారు.
