Begin typing your search above and press return to search.

బాబు వర్సెస్ జగన్ :ధీమా అదేనా ?

ఏపీ రాజకీయాల్లో రెండే పార్టీలు రెండే కులాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఇక స్టేట్ వైడ్ లీడర్ షిప్ కూడా పోటీ పెద్దగా లేకుండా ఉంది.

By:  Tupaki Desk   |   20 Jun 2025 8:30 AM IST
బాబు వర్సెస్ జగన్ :ధీమా అదేనా ?
X

ఏపీ రాజకీయాల్లో రెండే పార్టీలు రెండే కులాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఇక స్టేట్ వైడ్ లీడర్ షిప్ కూడా పోటీ పెద్దగా లేకుండా ఉంది. తెలంగాణాలోనే చూసుకుంటే ఎంతో మంది సీఎం మెటీరియల్ క్యాండిడేట్స్ కనిపిస్తారు. అలాగే ఎంతో మంది లీడర్స్ స్టేట్ వైడ్ ఫిగర్స్ గా ఉంటారు.

ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ ఉన్నాయి. మూడవ పార్టీగా జనసే ఇపుడిపుడే ఎమర్జ్ అవుతోంది. ఆ పార్టీ పవర్ ఏంటి అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది. ఇక చెప్పుకుంటే ఏపీకి కాబోయే సీఎంలు ఎవరు అన్నది చూస్తే కనుక జగన్, లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తారు. నాలుగవ పేరు అయితే ఎక్కడా వినిపించదు.

ఇక్కడ చంద్రబాబు గురించి మాట్లాడుకుంటే ఆయనకు పొలిటికల్ గా ఇవి చివరి ఇన్నింగ్స్ గానే చెప్పాల్సి ఉందని అంటారు. ఆయన ఈ మధ్యనే 76 ఏళ్ళ వయసులోకి వచ్చారు మరో నాలుగేళ్ల తరువాత ఆయన వయసు ఎనభైకి చేరుతుంది. దాంతో ఏపీకి ఫ్యూచర్ సీఎం లుగా పోటీలు పడేది బాబు తనయుడిగా లోకేష్ అలాగే వైసీపీ జనసేన అధినేతలు జగన్ పవన్ లు మాత్రమే.

దాంతో ఏపీ పాలిటిక్స్ లో జనాలకు కొత్త ఆప్షన్లు ఏవీ లేవు అనే అనుకోవాలి. ఇక జనసేన చూస్తే కనుక సొంతంగా పోటీ చేస్తేనే పవన్ కి సీఎం చాన్స్ వస్తుంది. పొత్తులు ఉంటే లోకేష్ కే సీఎం అయ్యే సీన్ అధికంగా ఉంటుంది. కూటమి కడితే ఇది సీన్. లేకపోతే మాత్రం వైసీపీకి మరో చాన్స్ ఉంటుంది.

ఇక ఇక్కడ రాజకీయ పార్టీల ఆలోచనలు ధీమాలు ఎలా ఉన్నాయి అంటే తామే ఆల్టర్నేషన్ అని తమకే అవకాశాలు వస్తాయని. ముందుగా టీడీపీ గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ ని ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. లోకేష్ కూడా బాగానే రాటు తేలుతున్నారు. ఆయన తన నాయకత్వానికి మెరుగులు పెట్టుకుంటున్నారు.

పటిష్టమైన స్థితిలో టీడీపీ ఉంది. ఏపీలోనే కాదు దేశంలోనే అత్యంత బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతీయ పార్టీ అది. దాంతో లోకేష్ ఫ్యూచర్ కూడా పొలిటికల్ గా తిరుగులేకుండా ఉండబోతోంది అన్నది ఒక ధీమాగా ఉంది. వైసీపీ అధినేత జగన్ ని కనుక 2029 ఎన్నికల్లో ఓడిచేసే ఏపీ పాలిటిక్స్ అంతా వార్ వన్ సైడ్ అన్నట్లుగా తమకే పూర్తిగా అనుకూలంగా మారుతుంది అన్నది కూడా టీడీపీ వ్యూహంగా ఉంది. అందుకే ఆ దిశగానే భారీ కార్యాచరణతో పసుపు పార్టీ అడుగులు వేస్తోంది.

ఇక వైసీపీ వైపు చూస్తే కనుక జగన్ ఆలోచనలు కూడా ధీమాతోనే ఉన్నాయి. చంద్రబాబు వయసుని ఆయన రాజకీయ జీవితంలో చివరి ఇన్నింగ్స్ ఇవేనని భావిస్తూ ధీమాగా ఉన్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో సైతం 76 ఏళ్ళ ముసలాయన అని బాబు మీద జగన్ సెటైర్లు పేల్చారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని అంటున్న ఆయన వయసు ఎంతో జగన్ చెప్పారు అంటే ఈ ఒక్క చాన్స్ మాత్రమే చంద్రబాబుకు ఉందని భావిస్తున్నారు అని అనుకోవాల్సి ఉంది.

అంతే కాదు చంద్రబాబునే ఆయన గట్టి ప్రత్యర్థిగా భావిస్తున్నారు అని కూడా విశ్లేషించుకోవాల్సి ఉంది. చంద్రబాబు తరువాత వారసుడిగా వచ్చినా లోకేష్ మీద రాజకీయ సమరం నల్లేరు మీద నడక అన్న ధీమా ఏదో వైసీపీ అధినేతకు ఉందనే భావించాలని అంటున్నారు. అందుకే ఆయన బాబు వయసు గురించే తరచుగా మాట్లాడుతుంటారు అని విశ్లేషకులు అంటారు.

ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి తగిన యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకున్నారో లేదో తెలియదు కానీ ఏపీలో టీడీపీ వైసీపీలను చూసేసిన సినిమాగా జనాలు భావిస్తారు కాబట్టి తమకే తప్పక చాన్స్ ఉంటుందని భావించవచ్చు అంటున్నారు. ఇలా మూడు పార్టీల మధ్యనే రాజకీయ కేంద్రీకృతం కావడం వల్ల ఓటములలోనూ గెలుపు ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. జనాలకు మాత్రం సరికొత్త ఆప్షన్లు అయితే ప్రస్తుతానికి లేనే లేవు అని చెప్పాల్సి ఉంది.