Begin typing your search above and press return to search.

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఏపీ...పథకాలతో మరింత దిగజారుడు!

ఏపీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది అని సామాన్యులు అంటే అది రాజకీయం అనుకుంటారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 10:10 AM IST
తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఏపీ...పథకాలతో  మరింత దిగజారుడు!
X

ఏపీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది అని సామాన్యులు అంటే అది రాజకీయం అనుకుంటారు. కానీ ఆర్థిక నిపుణులు అంటే అవునా అని ఆలోచిస్తారు. ఏపీ అప్పులలో ఉంది అని జగన్ హయాంలో రోజూ పెద్ద పెద్ద హెడ్డింగులలో వార్తలు వచ్చేవి. దాంతో పాటు ఏపీ ఏ శ్రీలంకనో ఏ పాకిస్థానో అవుతుంది అన్న భయాందోళనలు కూడా విపక్షాలు ఆనాడు రేకెత్తించాయి.

అయితే ఇపుడు ఏడాదిగా ఏపీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదని అంటున్నారు అప్పులు రెండు ప్రభుత్వాలు సేమ్ టూ సేమ్ గా చేస్తూ వస్తున్నాయని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ అయితే ఇప్పటికే తాను అయిదేళ్ళూ చేసిన అప్పులలో ఒక్క ఏడాదికే 40 శాతం మేర చేశారని కూడా విమర్శించారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పూర్తి అయ్యేనాటికి ఏపీలో కొత్త అప్పులు లక్షా అరవై వేల కోట్ల రూపాయల దాకా ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకోవడం షరా మామూలు అయింది అని అంటున్నారు. లేటెస్ట్ గా ఈ మంగళవారమే ఏడు వెల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు అని చెబుతున్నారు.

ఇలా అప్పులు చేస్తూ వాటికి వడ్డీలు కడుతూ వాటి కోసం అప్పులు కడుతూ ఏపీ ఆర్ధిక చక్ర బంధంలో ఇరుక్కుపోతోంది అని అంటున్నారు. నిజానికి ఏడాదిగా పధకాలు అయితే పెద్దగా ఇవ్వలేదు కానీ అప్పులు చేశారు. ఇపుడు పధకాలు ఒక్కోటీ చేయబోతున్నారు. దాంతో ఈ అప్పులు ఇబ్బడి ముబ్బడి అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే అభివృద్ధి అజెండాను చేసుకోవాలని కూటమి ప్రభుత్వం మొదట్లో అనుకుంది కానీ ఏడాది పాలన మీద వస్తున్న సర్వేలు సంక్షేమ పధకాలు ఇవ్వకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చిందన్న నివేదికలు వైసీపీ నుంచి ఇదే అంశం మీద కూటమి సర్కార్ మీద జరుగుతున్న రాజకీయ మాటల దాడులు వైసీపీకి ఏమైనా పొలిటికల్ గా స్కోప్ ఇచ్చేస్తున్నామేమో అన్న డౌట్లూ అన్నీ కలసి ఇపుడు కూటమి సర్కార్ ని సంక్షేమ బాటన నడిపిస్తున్నాయి అని అంటున్నారు.

అయితే కూటమి సర్కార్ ఈ ఆర్థిక భారం మోయగలదా అంటే కష్టమే అన్న మాట ఉంది. అంతే కాదు అటు అమరావతి రాజధాని నిర్మాణం బిగ్ స్కేల్ మీద ఉంది. పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం టూ బనకచర్ల ప్రాజెక్ట్ అని మరో ప్రాజెక్ట్ ఉంది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల అజెండా ఉంది. మరి డబ్బులు ఎక్కడ నుంచి అంటే అదే తెలియని వ్యవహారంగా మారుతోంది.

చాలా విషయాల్లో చూస్తే ఏపీ సర్కార్ ఇబ్బందులు పడుతోంది అనే అంటున్నారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కానీ వారికి బకాయి పడిన కరవు భత్యాలు కానీ ఇవేమీ ఇవ్వలేని స్థితి ఉందని అంటున్నారు. అలాగే చూస్తే కనుక చాలా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు కానీ నిధులు కష్టమే అన్న మాట ఉంది.

ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రాసిన ఒక ఆర్టికల్ అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి మీద కచ్చితమైన విశ్లేషణ గానే ఉంది. ఆయన రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసి వచ్చారు ఏపీ అప్పుల చిట్టా బాగా తెలుసు. అటువంటి ఆయన రాసిన ఈ ఆర్టికల్ ఏపీని ప్రేమించే వారిని ఆలోచింపచేస్తోంది.

ఇక చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలనే బలమైన వాదన ఉంది అని ఆయన అన్నారు. అంతే కాదు పూర్వ రంగాన్ని ప్రస్తావించారు. 2014లో తెలంగాణను పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి వేరు చేసినప్పుడు, ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన పన్ను వనరుగా ఉన్న హైదరాబాద్‌ను కోల్పోవడాన్ని ఏపీ ఈ రోజుకూ తట్టుకోలేకపోతోంది అని అన్నారు

ఏపీకి ప్రధానంగా ఆర్ధిక వనరు అంటూ ఏ మెగా సిటీ నుంచి రావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. అందువల్ల హైదరాబాద్ ని కోల్పోయిన ఏపీకి ఆ ఆర్ధిక నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక తరగతి వర్గం హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిమాండ్ చేసింది అని గుర్తు చేశారు.

అయితే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ డిమాండ్‌ను అంగీకరిస్తూ పార్లమెంటులో హామీ ఇచ్చినప్పటికీ, రాష్ట్రాన్ని విభజించే చట్టం ప్రత్యేక వర్గం హోదా కోసం ఎటువంటి నిబంధనను రూపొందించలేదు. దాంతో ఇది చెల్లని హామీగా ఉండిపోయింది. ఇక విభజిత ఏపీ పదకొండేళ్ళుగా చూస్తే అప్పుల మీద అప్పులు చేస్తూ సాగుతోందని అన్నారు

ఇపుడు కూడా ఏపీకి ఆర్ధిక దన్ను లేదు, కానీ సంక్షేమ పధకాలు అని ఆర్భాటాలకు పోతోంది. రాజకీయాల కోసం ప్రత్యర్ధిని ఎదుర్కోవడం కోసం పోటీలు పడుతోంది. ఏపీ అలా అప్పుల తిప్పలు పడుతోంది అని అంటున్నారు. మొత్తానికి ఎవరు ఒప్పుకోకపోయినా ఏపీలో ఒక రోజు అప్పులతో పుట్టి అప్పుతోనే ముగుస్తోంది. ఇది ఎంతవరకూ అంటే బహుశా ఇప్పట్లో జవాబు లేదేమో.