ఒకేసారి 23 ప్రపంచ రికార్డులు
ఒకేసారి ఏపీకి 23 ప్రపంచ రికార్డులు దక్కనున్నాయి. విశాఖ వేదికగా శనివారం ఆర్కే బీచ్ నుంచి భీమిలీ దాకా మొత్తం 28 కిలోమీటర్ల దూరం మేర తీర ప్రాంతమంతా లక్షలాది మందితో నిర్వహించిన యోగా డే విజయవంతం అయింది.
By: Tupaki Desk | 21 Jun 2025 3:59 PM ISTఒకేసారి ఏపీకి 23 ప్రపంచ రికార్డులు దక్కనున్నాయి. విశాఖ వేదికగా శనివారం ఆర్కే బీచ్ నుంచి భీమిలీ దాకా మొత్తం 28 కిలోమీటర్ల దూరం మేర తీర ప్రాంతమంతా లక్షలాది మందితో నిర్వహించిన యోగా డే విజయవంతం అయింది. దాంతో గిన్నీస్ బుక్ ఆర్ వరల్డ్ రికార్డులలోకి విశాఖ ఎక్కింది.
మూడు లక్షలకు పైగా యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. దాంతో అలా గిన్నీస్ రికార్డుకు విశాఖ్ అర్హత సాధించింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రికార్డుని ఎవరైనా బద్ధలు కొట్టాలీ అంటే మూడు లక్షలకు పైగా చేయాల్సి ఉంటుందని ఇ మరో వైపు 22 వేల 122 మందికి పైగా గిరిజన విద్యార్థులు 108 నిముషాల పాటు సూర్యచేశారని అది కూడా గిన్నీస్ రికార్డుకు అర్హత సాధించింది అన్నారు.
ఇక ఏపీలో అంతటా ఒక లక్షా 30 వేల పైన ప్రాంతాలలో యోగా చేశారు. రెండు కోట్ల 17 లక్షల మంది యోగాలో భాగస్వాములు అయి చేశారు. ఇదంతా ఒక రికార్డుగా బాబు చెప్పారు. లక్షా 44 వేల మంది యోగా ట్రైనర్లు తయారు అయ్యారు. ఇది కూడా రికార్డుగానే ఉంది.
ఒక కోటీ 80 లక్షల మందికి యోగా మూడు రోజుల పాటు యోగా చేయడం మరో రికార్డు గా ఉంది అన్నారు. . ఇక ఏపీలో యోగా నిర్వహించడం ద్వారా 21 వరల్డ్ రికార్డులతో పాటు రెండు గిన్నీస్ రికార్డులు కూడా సొంతం చేసుకోబోతున్నామని చంద్రబాబు చెప్పారు. అయిదు లక్షల టీ షర్టులు మ్యాట్స్ పంపించి కేంద్రం సహకరించింది అన్నారు
అంతే కాదు విశాఖ యోగా డిక్లరేషన్ ని తీసుకుని రాబోతున్నట్లుగా ఆయన వివరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా యోగా ద్వారా ఏమి చేయబోతున్నామని వివరిస్తామని చెప్పారు. రానున్న రోజులలో యోగ ధ్యాన పరిషత్ ని ఏపీలో ఏర్పాటు చేస్తామని బాబు చెప్పారు.
నిజానికి ఉమ్మడి ఏపీలో 1987లో నే యోగ ధ్యాన పరిషత్ కోసం చట్టం చేశామని ఆయన చెప్పారు. ఇపుడు విభజన ఏపీలో కూడా యోగా కోసం ఒక చట్టాన్ని తీసుకుని రావడం జరుగుతుందని ఆయన చెప్పారు. యోగా గేం చేంజర్ అని బాబు చెప్పారు. ఈ రోజు 18 వేల కోట్ల రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇతర మెడికల్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆపరెషన్స్ వల్ల బాడీని కట్ చేయడమే అన్నది తెలుసు అన్నారు. అయితే ప్రకృతి నుంచి ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఆయన అన్నారు. యోగా కోసం ప్రతీ రోజూ కొంత సమయం కేటాయిస్తే మంచి ఆరోగ్యవంతమైన సమాజం తయారు అవుతుందని బాబు అన్నారు.
అందుకే యోగాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తామని అన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా కూడా యోగా వంటి విషయంలో ఏమి చేయాలో చేస్తామని అన్నారు. యోగా నేచురోపతి, ఆయుర్వేదం వంటివి వారసత్వ సంపదగా ఉన్నాయని అన్నారు. గ్రీన్ ఎనర్జీ తో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా పెంపొందిస్తామని ఆయన చెప్పారు.
ఇవన్నీ కూడా కో ఆర్డినేట్ చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. మన ఆరోగ్యంతో పాటు భూమిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. యోగాను ప్రాధమిక పాఠశాల నుంచి పాఠ్యాంశంగా రూపొందిస్తామని ఆయన చెప్పారు. అలాగే అన్ని దశలలోనూ యోగాను ప్రమోట్ చేస్తామని ఆయన చెప్పారు.
