70 శాతం హామీల అమలు.. ఎవరి మాట ..!
ఇది ఇప్పుడు చర్చకు దారితీసింది. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినంపై కంటే కూడా.. 70 శాతం హామీల ను నెరవేర్చామన్న విషయంపైనే ప్రజలు దృష్టి పెట్టారు.
By: Tupaki Desk | 5 Jun 2025 10:00 PM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నెల 12 నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబా బు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం. అయితే.. సహజంగానే ప్రభుత్వానికి వయసు పెరుగుతున్న కొద్దీ.. సదరు ప్రభుత్వాధినేత ఇచ్చిన హామీలు.. చేస్తున్న పనులు పరిగణనలోకి వస్తాయి. అలానే ఇప్పుడు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల వ్యవహారం కూడా చర్చకు వస్తోంది. దీనిపైనే వైసీపీ `వెన్నుపోటు దినం` అంటూ.. నిరసన వ్యక్తం చేసింది.
ఇక, ఈ క్రమంలో కూటమి పార్టీలు కూడా.. ఎదురు దాడి చేశాయి. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా `సుదినం` పేరుతో `పీడవిరగడైందన్న` నినాదంతో మంత్రులు, నాయకులు.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రులు కొందరు.. కీలక ప్రకటనలు చేశారు. గత ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీల్లో 70 శాతం పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కేవలం 30 శాతం మాత్రమే హామీలు మిగిలి ఉన్నాయని.. అవి కూడా పూర్తి చేస్తామని మంత్రి సుభాష్, సవితలు ప్రకటించారు.
ఇది ఇప్పుడు చర్చకు దారితీసింది. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినంపై కంటే కూడా.. 70 శాతం హామీల ను నెరవేర్చామన్న విషయంపైనే ప్రజలు దృష్టి పెట్టారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతు న్న నేపథ్యంలో నిజంగానే మంత్రులు చెప్పినట్టుగా 70 శాతం హామీలు అమలు చేసి ఉంటే.. దీనికి మించి న రికార్డు లేదు. దీనికి మించిన సంతోషం కూడా.. లేదు. అసలు అలాంటప్పుడు.. వైసీపీ కూడా ఆచి తూచి అడుగులు వేసే పరిస్థితిని కల్పించినట్టే అవుతుంది.
మరి నిజంగానే 70 శాతం హామీల అమలు జరిగిందా? లేక.. మంత్రులు నోటి మాటగా చెప్పుకొచ్చారా? అనే ది ప్రశ్న. ఇతర నాయకులు చెప్పి ఉంటే వేరేగా ఉండేది. కానీ, మంత్రులు చెప్పారు కాబట్టి.. ప్రజల మధ్య చర్చ వస్తోంది. ఇది పెరిగి పెద్దయితే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పువు. ఎందుకంటే.. ప్రస్తుతం సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి మాత్రమే పట్టాలెక్కించారు. అది ఉచిత సిలిండరు.
అయితే.. ఇది కూడా సరిగా అమలు కావడం లేదన్న విషయాన్ని సంబంధిత మంత్రే చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పక్షాన మాట్లాడే వారు.. కొంత సంయమనం పాటించకపోతే.. ప్రజల్లో చర్చకు దారి తీసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
