అభివృద్ధికి అందలం.. కూటమి బేఫికర్!
సంక్షేమ పథకాల విషయానికి వస్తే.. గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన ఉచిత సిలిండర్ల పథకంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2025 9:37 AM ISTఏపీలో కూటమి సర్కారు అనుసరిస్తున్న అభివృద్ధి మంత్రానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధిపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 62 శాతం మంది ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి పనులు వడివడిగా సాగుతున్నా యని చెప్పగా.. 32 శాతం మంది మాత్రం ఇంకా వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. మొత్తంగా కూటమి ప్రభు త్వానికి కీలకమైన అభివృద్ధి రంగం ప్రజలతో కూడా జై కొట్టించుకుంటుండడం గమనార్హం. వీటిలో ప్రధానంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న పెట్టుబడులపై కసరత్తు.. ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది.
''పెట్టుబడులు వస్తే.. మాకు ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశ ఉంది'' అని యువత ఎక్కువగా చెప్పుకొస్తున్నారు. ఇక, కూలి పనులు చేసుకునేవారు కూడా.. రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని.. దీంతో తమకు రోజు వారీ పనులు దొరుకుతు న్నాయని అభిప్రాయపడ్డారు. అంటే.. పెట్టుబడుల ద్వారా లభించే, లభిస్తున్న పనులపై ప్రజల్లో సంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ చేస్తున్న పనులపై గ్రామీణ ప్రజలు ఆనందంతో ఉన్నా రు. ప్రధానంగా రహదారుల నిర్మాణం, ఇంటింటికీ తాగునీరు, గోశాలల నిర్మాణం వంటివి వారిని ఆనందానికి గురి చేస్తున్నాయి.
సంక్షేమ పథకాల విషయానికి వస్తే.. గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన ఉచిత సిలిండర్ల పథకంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న కూటమి సర్కారు.. ఆ హామీని అక్టోబరు నుంచి అమలు చేస్తోంది. ఇక, మరోకీలమైన సంక్షేమ పథకం 'తల్లికి వందనం.' దీనికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ పథకాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఒక్క రోజులోనే 80 శాతం మంది లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో రూ.13000 చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ నిధులు ఇచ్చారు. దీనిపై ప్రజల్లో మంచి స్పందనే లభిస్తోంది.
ఇక, పేర్లు మార్చి.. పరపతి పెంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో వైసీపీ హయాంలో ఏ పథకం చేపట్టినా.. ముందు జగనన్న.. వెనుక జగనన్న ఉండేవి. అయితే.. కూటమి సర్కారు వచ్చాక.. అప్పటికే ఉన్న వాటికి మేధావులు, విద్యావేత్తల పేర్లు(ఉదాహరణకు సర్వే పల్లి రాధాకృష్ణన్) పెట్టారు. అలానే సమాజంలో గుర్తింపు పొందిన వారి పేర్లు(ఉదాహరణకు డొక్కా సీతమ్మ) పెట్టారు. వీటిపై మధ్యతరగతి ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. అటుఅభివృద్ధి, ఇటు సంక్షేమం విషయంలో మెజారిటీ ప్రజలు మంచి మార్కులే వేయడం గమనార్హం.
