బీజేపీ ఇక, బాబు పక్షమే.. రీజన్ ఇదే.. !
ఏపీలో కూటమిగా ఏర్పడి.. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న కూటమి పార్టీల్లో బీజేపీ ఒకటి. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలతో జట్టుకట్టి బీజేపీ విజయం దక్కించుకుంది.
By: Garuda Media | 27 Dec 2025 5:00 PM ISTఏపీలో కూటమిగా ఏర్పడి.. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న కూటమి పార్టీల్లో బీజేపీ ఒకటి. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలతో జట్టుకట్టి బీజేపీ విజయం దక్కించుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలు గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీ సంగతి ఎలా ఉన్నా.. విభజన తర్వాత.. ఈ రేంజ్‌లో బీజేపీ ఏపీలో విజయం దక్కించుకోవడం ఇదే తొలిసారి. అసెంబ్లీలో 8 మంది కమలం పార్టీ నాయకులు.. పార్లమెంటుకు ముగ్గురు ఎన్నిక కావడం ఆ పార్టీకి భారీ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి.. కూటమిగానే బీజేపీ ఉంటుందా? అనే విషయంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయి. 1) 2024 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుప్రకటించిన సూపర్ సిక్స్ హామీలపై బీజేపీ మౌనంగా ఉంది. 2) కూటమిలో ఉన్నప్పటికీ.. కూటమిఅజెండాకు పెద్దగా ప్రాధా న్యం ఇవ్వకపోవడం. ఈ రెండు కారణాలతో కూటమిలోనే బీజేపీ ఉన్నప్పటికీ.. అనేక సందేహాలకు అవకా శం ఇచ్చినట్టు అయింది. నిజానికి ఇప్పటి వరకు బీజేపీ కూడా.. అనుసరించిన విధానం.. తనకు మేలు జరుగుతుందంటే.. ఏ పనినైనా చేస్తుందన్న వాదన ఉంది.
దీంతో ఇప్పుడు కాకపోతే..వ చ్చే ఎన్నికల నాటికి అయినా.. బీజేపీ వైసీపీతో అంతర్గతంగా చేతులుకలిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. దీనికి తోడు కూటమి నాయకులు చంద్రబాబు, పవ న్ 15 ఏళ్ల కూటమి గురించి చెబుతున్నా.. బీజేపీ నాయకులు స్పందించలేదు. దీంతో బీజేపీ వ్యవహారంపై అన్ని వర్గాల్లోనూ అనుమానాలు ఉన్నాయి. అయితే.. తాజాగా మారుతున్న పరిణామాలతో బీజేపీ ఇక, సీఎం చంద్రబాబును వదిలి పెట్టే ప్రసక్తి ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంత బలంగా బాబే బీజేపీతో బంధం పెంచుకుంటున్నారని చెబుతున్నారు.
1) బీజేపీ కోరినవన్నీ సీఎం చంద్రబాబు చేస్తున్నారు. పార్టీ ఓటు బ్యాంకు, సీటు బ్యాంకుతో సంబంధం లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
2) రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహానికంటే కూడా ముందే.. వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించా రు. అంతేకాదు.. త్వరలోనే వాజ్ పేయి స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చంద్రబాబు అనుమతి ఇచ్చారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
3) గురువారం వరకు జరిగిన వాజ్ పేయి-మోడీ సుపరిపాలన యాత్రలకు చంద్రబాబు సంపూర్ణంగా సహకరించారు. అంతేకాదు.. టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు.
4) ఎక్కడ అవకాశం వస్తే.. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజయాలను, ఆయన పాలనను కూడా చంద్రబాబు కొనియాడుతూ.. జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
5) కేంద్రంతో ఎలాంటివివాదాలు పెట్టుకోకుండా.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను, వనరులను తెచ్చుకుం టున్నారు. ఇలా.. బీజేపీతో బాబు బంధం వేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నే ఇప్పుడు బాబు లేకుండా ఉండే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
