Begin typing your search above and press return to search.

ఏపీలో బెగ్గింగ్ నిషేధం.. స‌ర్కారు జీవో!

తాజాగా వ‌చ్చిన జీవో ప్ర‌కారం.. ఇపుడు ఆంధ్రాలో భిక్షాటన చేయడం, వారికి డబ్బు ఇవ్వడం, లేదా వారితో లావాదేవీలు నిర్వహించడం నిషేధం.

By:  Tupaki Desk   |   31 Oct 2025 7:00 AM IST
ఏపీలో బెగ్గింగ్ నిషేధం.. స‌ర్కారు జీవో!
X

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క జీవోను జారీ చేసింది. దీని ప్ర‌కారం.. రాష్ట్రంలో బెగ్గింగ్‌ను నిషేధిత జాబితాలో చేర్చా రు. వాస్త‌వానికి గ‌త ఏడాది నుంచే దీనిపై క‌స‌ర‌త్తు చేసిన స‌ర్కారు.. తాజాగా ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌లు చేస్తు న్న విధానాల‌పై అధ్య‌య‌నం చేసింది. అనంత‌రం.. రాష్ట్రంలో బెగ్గింగ్‌(అడుక్కోవ‌డ‌మే వృత్తిగా) ను నిషేధిస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవో జారీ చేశారు.

కాగా.. దేశంలో భిక్షాటనపై(బెగ్గింగ్) నిషేధం కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. వీటిలో ఈశాన్య రాష్ట్రం మిజోరం, మధ్యప్రదేశ్‌, యూపీలోని ల‌క్నోలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ ప‌రిమితంగా బెగ్గింగ్‌పై నిషేధం ఉంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చట్టం–2025'ని అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటనను నిషేధిస్తూ జీవో విడుదల చేసింది.

రీజ‌నేంటి?

బెగ్గింగ్‌ను నిషేధించ‌డం వెనుక‌.. పెట్టుబ‌డులు, అభివృద్ధి కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని.. గ‌తంలోనే స‌ర్కారు వెల్ల‌డించింది. దేశ విదేశాల నుంచి అనేక మంది పెట్టుబ‌డి దారులు వ‌స్తున్న నేప‌థ్యంలో బెగ్గింగ్ తీవ్ర ఇబ్బందిగా ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించాలా? కొన్ని పెట్టుబ‌డులు తెచ్చే సంస్థ‌లు.. ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లోనే నిషేధం విధించాలా? అనే విష‌యంపై చ‌ర్చించింది. అయితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబ‌డులు వ‌స్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బెగ్గింగ్‌ను నిషేధించారు.

వారి ప‌రిస్థితి ఏంటి?

తాజాగా వ‌చ్చిన జీవో ప్ర‌కారం.. ఇపుడు ఆంధ్రాలో భిక్షాటన చేయడం, వారికి డబ్బు ఇవ్వడం, లేదా వారితో లావాదేవీలు నిర్వహించడం నిషేధం. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు యాయ‌వారం, యాచ‌క వృత్తిపై ఆధార‌ప‌డిన కుటుంబాల ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌. వీరిని గుర్తించి.. పీ-4కు అనుసంధానం చేయ‌డం ద్వారా వారి జీవితాల్లో గౌర‌వ ప్ర‌ద‌మైన ప‌రిస్థితిని తీసుకురానున్నారు. అదేవిధంగా కొన్నాళ్ల పాటు ప్ర‌భుత్వ‌మే వారికి పున‌రావాసం క‌ల్పించ‌నుంది. దీనిని సామాజిక సంక్షేమ శాఖ నిర్వ‌హిస్తుంది.