బాబు కోసం.. బాబు చేత.. కదిలి వచ్చారుగా... !
ఉవ్వెత్తున ఎగిరిన కడలి తరంగాన్ని చూసి ఉంటారు. కానీ.. ఉవ్వెత్తున తరలి వచ్చిన జనాలను మాత్రం పెద్దగా చూసి ఉండరు.
By: Tupaki Desk | 4 Jun 2025 8:35 PM ISTఉవ్వెత్తున ఎగిరిన కడలి తరంగాన్ని చూసి ఉంటారు. కానీ.. ఉవ్వెత్తున తరలి వచ్చిన జనాలను మాత్రం పెద్దగా చూసి ఉండరు. రాష్ట్రానికి నలువైపులా ఉన్న అన్ని జాతీయ రహదారులు నిండిపోయాయి. టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. విమానాశ్రయాలు నిండిపోయాయి. విదేశాలకు వెళ్లే విమానాలు పూర్తిగా రద్దీగా మారిపోయాయి. ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చిన జనం.. ఎక్కడెక్కడ నుంచో.. కదలి వచ్చిన జనం.. ఇదీ.. ఏడాది కిందట ఏపీలో కనిపించిన దృశ్యం.
నాడు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన ప్రజాస్వామ్య వాదులు.. చంద్రబాబును జైలులో పెట్టడాన్ని సహించలేని పార్టీ నాయకులు, అభిమానులు దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా తరలి వచ్చారు. సొంత ఖర్చులు పెట్టుకుని ఏపీకి వచ్చి.. పోలింగ్ బూతుల వద్ద నిలబడి మరీ.. ఓట్లు వేశారు. మార్పు కోసం .. మరో చరిత్ర కోసం.. నినాదంతో కదలి వచ్చిన ఓటర్లు.. బాబు కోసం.. బాబు చేత అన్నట్టుగా సర్కారును మార్చ డంలో తీవ్రస్థాయిలో ప్రయత్నం చేశారు.
నాడు వచ్చిన వార్తల్లో.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ దాదాపు సగం ఖాళీ అయింది. ఇక, హైదరాబాద్ అయితే.. పూర్తిగా ఖాళీ అయింది. నాడు హైదరాబాద్‌లోని నిరంతరం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్‌లో కొందరు క్రికెట్ ఆడుకున్న వీడియోలువైరల్ అయ్యాయి. వారంతా ఏపీకి తరలి వచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆశతో కొందరు.. జగన్‌ను అధికారం నుంచి దింపేయాలన్న కసితో మరికొం దరు.. విషయం ఏదైనా.. ఏపీ మాత్రం కిక్కిరిసిపోయింది.
జూన్ 4, 2024.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు. ఎక్కడ చూసినా.. ఎటు చూసినా.. తండోపతండా లుగా ఎన్నిక లబూత్‌ల వద్ద క్యూలు. రాత్రి వరకు సాగిన పోలింగ్. ఇవన్నీ.. ఏపీలో మార్పు కోసమే కాదు.. చంద్రబాబు కోసం.. చంద్రబాబు చేత అన్నట్టుగా మారిన పరిణామం. ఎక్కడా ప్రజల మధ్య సంశయం లేదు. కానీ, రాజకీయ నేతల మధ్యే సందేహాలు.. ఎక్కడా ప్రజల్లో ఎలాంటి గడబిడ లేదు.. పార్టీల మధ్యే వైరుధ్యాలు ఇలా.. సాగిన నాటి ఎన్నికకు నేటితో ఏడాది పూర్తి.
