బాబు జగన్ ఇద్దరూ ఉండాల్సిందే !
ఏందుకు అంటే ఏపీ రాజకీయం వన్ సైడ్ గా ఉంటే వారు సొంతంగా ధీటుగా ఉంటారు. కేంద్రాన్ని కేంద్రంలోని పార్టీని కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఉంటారు.
By: Tupaki Desk | 28 Jun 2025 9:19 AM ISTఏపీ రాజకీయాలు ఏక ధృవ ప్రపంచంగా మారిపోకుండా ఉండాలని ఎవరికి ఉంది. ఏపీ పాలిటిక్స్ లో ఏకపక్షంగా ఒకే పార్టీ ఉంటే ఎవరికి ఇబ్బంది. అసలు ఏపీ రాజకీయాల్లో పోటా పోటీగా వైసీపీ టీడీపీ ఉండాల్సిందేనా. అటు చంద్రబాబు ఇటు జగన్ మోహరించాల్సిందేనా అంటే తలపండిన రాజకీయ జీవులు చెబుతున్నది విశ్లేషిస్తున్నది ఇదే.
ఏందుకు అంటే ఏపీ రాజకీయం వన్ సైడ్ గా ఉంటే వారు సొంతంగా ధీటుగా ఉంటారు. కేంద్రాన్ని కేంద్రంలోని పార్టీని కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఉంటారు. అంతే కాదు పొత్తులు ఎత్తులూ అసలు కుదరవు. మొత్తం అంతా పరచుకుంటారు. అందుకే బాబు సీఎం గా ఉంటే ఇటు జగన్ అపొజిషన్ లో ఉండాల్సిందే. అలాగే జగన్ సీఎం గా ఉంటే బాబు ఆయన మీద పోరాడుతూ గట్టిగా ఉండాల్సిందే.
అపుడే తెర వెనక నుంచి చక్రం తిప్పే పార్టీలకు ఏపీ రాజకీయాల మీద గ్రిప్ వస్తుందా అన్నదే చర్చగా ఉంది. ఏపీలో జగన్ కానీ బాబు కానీ అసలు కలిసేది లేదు. ఆ ప్రసక్తే ఉండదు ఈ ఇద్దరిదీ ఎవరి దారి వారిదే. ఇద్దరికీ సీఎం కుర్చీ కావాలి. ఇద్దరూ అధికారం కోసమే చూస్తారు. దాని కోసం ఢీ కొంటారు.
అపుడే తులసీదళంగా ఇతర పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది వారి ఆశలు డిమాండ్లు కూడా నెగ్గుతాయి. అలా కాకుండా అటు జగన్ కానీ ఇటు బాబు కానీ పూర్తిగా ఏకపక్షంగా రాజకీయం చేసేలా ఉంటే రెండవ పార్టీ అన్నది పూర్తిగా ఎలిమినేట్ అయితే అపుడు ఏపీ పొలిటికల్ సినారియో కంప్లీట్ గా మారిపోతుంది.
బలమైన పార్టీగా ఉంటూ ఏకంగా కేంద్ర రాజకీయాలను జాతీయ రాజకీయాలను శాసించే బలం ఆ పార్టీకి వస్తుంది. అందుకే బ్యాలెన్స్ కోసమే ఈ ఏకధృవ రాజకీయాలను ద్విముఖ రాజకీయంగా మారుస్తున్నారు అని అంటున్నారు. ఇక చంద్రబాబు రాజకీయంగా ఉండకూడదు అని జగన్ అనుకుంటారు. అలాగే జగన్ రాజకీయాన్ని భూస్తాపితం చేయాలని బాబు అనుకుంటారు.
కానీ ఇవి నెరవేరేది లేదు అనే అంటున్నారు 2014 లో వైసీపీ ఓటమి పాలు అయింది. నిజానికి అప్పటికి వైసీపీ కొత్తగా పుట్టిన పార్టీ. తొలి ఎన్నికల్లో ఓటమి చెందితే ఇక మలి ఎన్నికల దాకా కూడుకుని కుదురుకునే బలం అయితే ఉండదు. కానీ ఆ అయిదేళ్ళ పాటు వైసీపీకి తెర వెనక అవసరమైన బలం అందింది అని అంటారు. ఇక 2019లో వైసీపీ భారీ ఆధిక్యంతో గెలిచింది. చంద్రబాబు టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు కానీ 2024లో పొత్తులు పెట్టుకుని మరీ బీజేపీ అవసరమైన బలాన్ని అందించింది.
ఇక కూటమి అధికారంలో ఉంది. బ్రహ్మాండమైన బలంతో ఉంది అని అనుకున్నారు. వైసీపీ ఈ దెబ్బతో సరి అని అనుకున్నారు. కానీ వైసీపీ ఏపీ పొలిటికల్ సీన్ లో ఉండాల్సిందే అంటున్న వారూ ఉన్నారు గతంలో మాదిరిగా తెర వెనక నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు ఎప్పటికీ వైసీపీకే సొంతం కావు. అలాగే టీడీపీకి కూడా కానే కావు. మరి ఆడించేది వెనక ఎవరు అంటే అందరికీ తెలిసిందే అని అంటున్నారు
