Begin typing your search above and press return to search.

వైసీపీ వస్తే ఏసీబీకి 164 మంది ఎమ్మెల్యేలునా ?

తమిళనాడులో ఇపుడు అయితే అంతా బాగానే ఉంది. కానీ ఒకప్పుడు అయితే నువ్వా నేనా అన్నట్లుగా పాలిటిక్స్ సాగింది.

By:  Satya P   |   4 Aug 2025 9:00 PM IST
వైసీపీ వస్తే ఏసీబీకి 164 మంది ఎమ్మెల్యేలునా ?
X

ఏపీ రాజకీయం అంటే ఇపుడు ప్రతీకారాలే కనిపిస్తున్నాయి. నాయకులు కూడా తాము వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పడం కంటే కూడా ప్రత్యర్ధి పార్టీలకు ఏ రకమైన సినిమా చూపించాలనే చూస్తున్నారు. వాటి మీదనే సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో రెడ్ బుక్కులు డిజిటల్ లైబ్రరీలు కూడా పోటా పోటీగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో రాజకీయాలు ఇపుడు చాలా ముందుకు వచ్చేశాయి ఏపీలో అయితే రాజకీయ ప్రత్యర్ధులు లేరు. ఇంకా ఎక్కువగానే అన్నట్లుగా రాజకీయ కధ సాగుతోంది. దాంతో రాజకీయ వాతావరణం గురించి ఇంటా బయటా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.

తమిళనాడు తరహాలోనే :

తమిళనాడులో ఇపుడు అయితే అంతా బాగానే ఉంది. కానీ ఒకప్పుడు అయితే నువ్వా నేనా అన్నట్లుగా పాలిటిక్స్ సాగింది. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు పెట్టింది పేరుగా మారింది. అక్కడా డీఎంకే అన్నా డీఎంకేల మధ్య భీకరమైన రాజకీయ పోరు సాగేది ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీకి చెందిన మాజీ సీఎం ని అరెస్టు చేస్తారు. ఆ విధంగా జయలలితను కరుణానిధి అరెస్టు చేయించారని అర్ధరాత్రి వృద్ధుడు అని చూడకుండా కరుణానిధిని అరెస్టు చేశారు. అలా జాతీయ స్థాయిలో ఒక దశలో తమిళనాడు అయితే హాట్ టాపిక్ గా ఉంటూ వచ్చేది.

టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ :

ఏపీలో కాంగ్రెస్ టీడీపీల మధ్య రాజకీయం దశాబ్దాలుగా దాటినా అది వ్యక్తిగత అజెండాల దాకా వెళ్ళలేదు. దానికి కారణం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు అయిదేళ్ళకు నలుగురు మారేవారు. అధినాయకత్వం పైన ఉండేది. దాంతో పాలనాపరంగా అంతా సాగిపోతూ వచ్చేది. ఇక టీడీపీలో చూసినా ప్రజా సమస్యల మీద విమర్శల వరకే పరిమితం అయ్యేవారు. ఇంకా చెప్పాలీ అంటే ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం కనిపించేది. అసెంబ్లీకి అంతా వచ్చేవారు. ఒకరిని ఒకరు పలకరించుకునేవారు. అధికార ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళేవి రాజకీయం అయిదేళ్ళకు ఒకసారి మాత్రమే అంతా చూసేవారు.

ఏపీలో తీవ్రమైన పోరు :

ఇపుడు చూస్తే మాత్రం ఏపీలో తీవ్రమైన రాజకీయ పోరు సాగుతోంది. రాజకీయంగా ఢీ అంటే ఢీ కొడుతున్నారు. ఉమ్మడి ఏపీలోనే వైసీపీ పుట్టింది. ఆనాడు కాంగ్రెస్ కూడా ఉండేది. అలా త్రిముఖ పోరు సాగేది. అయితే విభజన ఏపీకి వచ్చేసరికి వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం మారిపోయింది. రెండూ ప్రాంతీయ పార్టీలే. రెండు పార్టీలకూ వారే అధినాయకత్వం. దాంతో రాజకీయం కాస్తా కొత్త పుంతలు తొక్కింది. ఒకరు అధికారంలోకి వస్తే మరొకరి మీద ప్రతీకారం అన్నట్లుగా ఏపీలో తమిళనాడు సీన్ కనిపిస్తోంది.

రప్పా రప్పా రాజకీయం :

జగన్ సీఎం గా ఉన్నపుడు టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేశారు. దాంతో అసలు కధ మొదలైంది. పాలిటిస్క్ పీక్స్ కి చేరింది. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. ఏకంగా 11 సీట్లకే పరిమితం అయింది. అయినా సరే వైసీపీకి దాదాపుగా 40 శాతం పైగా ఓట్లు వచ్చారు. దాంతో వైసీపీ జనంలోకి వస్తోంది. అటు రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతల మీద కేసులు పెడుతూంటే ఇటు వైసీపీ నేతలు రప్పా రప్పా అంటున్నారు. దాంతో రాజకీయం కాస్తా వేరే లెవెల్ కి వెళ్తోంది.

కూటమి ఏలుబడిలో :

ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది. ఏపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతీ దానిలో మనీని చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. కమిషన్లకు కూడా ఒత్తిడి బాగా పెడుతున్నారు అని అంటున్నారు. ఎక్కడ డబ్బుతో లావాదేవీలు ఉన్నాయో వెతికి మరీ అక్కడ చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. అంతే కాదు తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో చూస్తే కనుక ఈ అయిదేళ్ళూ తిరిగేసరికల్లా చాలా మంది మీద వైసీపీ కూడా టార్గెట్ చేసి తాను కనుక అధికారంలోకి వస్తే ఏసీబీ కేసులు పెడుతుందా అన్నదే చర్చగా ఉంది.

మారాల్సింది రాజకీయమే :

వారూ వీరూ కాదు రాజకీయమే మొత్తం మార్చాల్సి ఉందని అంటున్నారు. దానికి అధినేతల స్థాయి నుంచే జరగాలని అంటున్నారు. ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాడే పరిస్థితి రావాలి అలాగే అనుచిత విమర్శలు చేసుకోవడం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటి వాటికి స్వస్తి పలకపోతే ఎవరు అధికారంలోకి వచ్చినా రెడ్ బుక్కులు రప్పా రాజకీయాలనే జనాలు వినే పరిస్థ్తి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే దేశంలో రాజకీయం ఒక ఎత్తున సాగుతూంటే ఏపీ రాజకీయమే వేరు అన్నట్లుగా ఉంది అంటున్నారు.