Begin typing your search above and press return to search.

వావ్ అనేలా అనంత్ అంబానీ - రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్

టాప్ టెన్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా.. ఆసియా కుబేరుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ - నీతూ అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుక ఎంత గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 May 2024 4:06 AM GMT
వావ్ అనేలా అనంత్ అంబానీ - రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్
X

టాప్ టెన్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా.. ఆసియా కుబేరుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ - నీతూ అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుక ఎంత గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరిగే పెళ్లి వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్నాయి. తాజాగా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు సంబంధించిన వివరాలుబయటకు వచ్చాయి. జులై 12న జరిగే ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేయటం తెలిసిందే. దీనికి ముందుగా మే 28 నుంచి 30 మధ్య దక్షిణ ప్రాన్స్ లోని క్రూయిజ్ షిప్ లో రెండో ప్రీవెడ్డింగ్ వేడుక భారీగా సాగనుంది.

ఈ వేడుకలో పేరు మోసిన సెలబ్రిటీలు హాజరు కానున్నారు. సినిమాటిక్ గా ఉండే ఈ వేడుక వివరాల్లోకి వెళితే క్రూయిజ్ ఇటలీ నుంచి బయలుదేరనుంది. దీని గమ్యస్థానం సౌత్ ఫ్రాన్స్ గా చెబుతున్నారు. తమ పెళ్లి వేడుక తమకు మాత్రమే కాదు..తమ బంధువులు.. అత్యంత సన్నిహితులకు మరిచిపోలేని మధురానుభూతిగా మార్చాలని అంబానీ కుటుంబం ఆశిస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్ తో 2017లో పరిచయమైన అనంత్-రాధికలు తర్వాత ప్రేమ జంటగా మారటం.. 2023లో రాజస్థాన్ లోని నాథ్ ద్వారాలో పెళ్లి ప్రపోజల్.. ముంబయిలోని తన నివాసమైన ఆంటిలియాలో ఎంగేజ్ మెంట్.. 2024లో జామ్ నగర్ లో మూడు రోజుల ప్రీవెడ్డింగ్ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన అంబానీ ఫ్యామిలీ ఇప్పుడు రెండో ప్రీవెడ్డింగ్ వేడుకను ఇంత భారీగా ప్లాన్ చేశారు. ఇప్పటికే వందల కోట్లను ఈ పెళ్లికి ఖర్చు చేయటం తెలిసిందే.

ఈ నెలాఖరులో జరిగే సెకండ్ ప్రీవెడ్డింగ్ వేడుకకు బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్ లాంటి స్టార్ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిధులు హాజరవుతారు. పెళ్లికొడుకు అనంత్ అంబానీ అన్న ఆకాష్ అంబానీ - శ్లోకా మెహతా జంటతో క్లోజ్ గా ఉండే బాలీవుడ్ జంట రణబీర్ కపూర్.. అలియాభట్ లు కూడా ఈ ట్రిప్ లో పాల్గొంటారని చెబుతున్నారు ఈ టాప్ సెలబ్రిటీ ఈవెంట్ కు హాజరయ్యే అతిధులకు సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. ఏమైనా అంబానీ.. అంబానీనే!