జేసీ ప్రభాకర్ రెడ్డికి అలా స్ట్రోక్ ఇచ్చిన ఎస్పీ... ఇష్యూ వైరల్!
అటు అనంతపురం జిల్లాలోనే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 Oct 2025 7:23 PM ISTఅటు అనంతపురం జిల్లాలోనే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆయన పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు.
ఇందులో భాగంగా... 'తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా..' అంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు! ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు!
అవును... అనంతపురం నా అడ్డా, తాడిపత్రిలో నేను ఎంతంటే అంత అన్నట్లుగా వ్యవహరిస్తారనే కామెంట్లు సొంతం చేసుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి తాజాగా ఎస్పీ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో విషయం తెలిసినవారు.. ‘అట్టుంటాది పోలీసులతో, మనకు అవసరమా సర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు!
అసలేం జరిగిందంటే..?:
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తాడిపత్రి ఏఎస్పీ పై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయగా.. దీనిపై జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై విలేకరులతో మాట్లాడుతూ జేసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మాదగ్గరా తుపాకులున్నాయి’ అనే విషయంపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎస్పీని కలిసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయన్ను కలిసేందుకు ఎస్పీ నిరాకరించారు. దీంతో ఎస్పీ ఛాంబర్ బయట సుమారు గంట సేపు నిరీక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. చేసేదేమీ లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో. ఇది జేసీకి ఎస్పీకి ఫస్ట్ షాక్ ట్రీట్ మెంట్ అని అంటున్నారు పలువురు!
జర్నలిస్టులపైనా జేసీ దుర్భాష!:
అనంతపురం ఎస్పీ జగదీశ్ ను కలవడానికి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి.. కార్యాలయ ఛాంబర్ లో సుమారు గంట సేపు వేచి చూసి.. ఎస్పీని కలవకుండానే వెనుదిరిగి.. బయటకు వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని మీడియా ప్రతినిధులు మాట్లాడాలని కోరారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన జేసీ.. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... 'ఏందీ తీస్తారు వీడియోలు.. పనిపాట లేని.. మీతో మాట్లాడేదే లేదు.. బయటకు పోండిరా.. పనికి మాలిన ఛానల్స్ ను పెట్టుకుని ఇంట్లో వాళ్ల గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతారా?.. మీ ఇళ్ల దగ్గర వచ్చి మీ కథ చెబుతా..' అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో జేసీ వ్యవహారశైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
