Begin typing your search above and press return to search.

అనంత్ అంబానీ నెల జీతం ఎంత?

అంతేకాదు.. రిలయన్స్ గ్రూపు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 6:00 PM IST
అనంత్ అంబానీ నెల జీతం ఎంత?
X

వేలాది కోట్ల ఆస్తిపరుడికి వారి కంపెనీలో ఇచ్చే జీతం ఎంత? అందునా భారతదేశ కుబేరుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి ఇచ్చే జీతం లెక్కలు తాజాగా వెలుగు చూశాయి. దీంతో.. అతడి వార్షిక వేతనాల లెక్కల్ని తెలుసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

తాజాగా బయటకు వచ్చిన అధికారిక పత్రాల్లోని సమాచారం ప్రకారం అనంత్ అంబానీ వార్షిక వేతనం రూ.10-20 కోట్ల మధ్యలో ఉండొచ్చని కంపెనీ వాటాదారులకు ఇచ్చిన నోటీసులో దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇంధన వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు.

అంతేకాదు.. రిలయన్స్ గ్రూపు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డుల్లోనూ సభ్యుడిగా ఉన్న అనంత్ కు లభించే వార్షిక ఆదాయం లెక్కలు చూస్తే కనిష్ఠంగా నెలకు కోటి రూపాయిల కంటే తక్కువగా.. గరిష్ఠంగా రూ.2 కోట్ల కంటే తక్కువ ఉండటం గమనార్హం.

తన వారసత్వ ప్లానింగ్ లో భాగంగా ముకేశ్ అంబానీ తన ముగ్గురు పిల్లలు ఆకాశ్.. ఈశా.. అనంత్ లను 2023లోనే ఆర్ఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించారు. అయితే.. ఈ హోదాలో వీరికి ఎలాంటి జీతాలు ఇవ్వరు. బోర్డు సమావేశాలకు హాజరైనందుకు మాత్రం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4 లక్షలు చొప్పున.. లాభాలపై కమిషన్ కింద ఒక్కొరికి రూ.97 లక్షలు చెల్లించారు.

ఇక.. అనంత్ విషయానికి వస్తే సంసథ ఈడీగా ఈ ఏప్రిల్ లో నియమితులయ్యారు. ఈ హోదాలో మాత్రం జీతభత్యాల్ని పొందుతారు. అంతేకాదు తన భార్యకు.. సహాయకులకు అయ్యే ప్రయాణ ఖర్చులతో పాటు.. ఆహారం.. వసతి ఖర్చుల్ని కూడా రీపే చేస్తారు. కంపెనీ వ్యాపారానికి కారు ఏర్పాట్లు.. నివాసంలోని కమ్యూనికేషన్లకు అయ్యే ఖర్చుల్ని కూడా కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. భద్రతతో పాటు.. వైద్య చికిత్సలకు అవసరమయ్యే ఖర్చుల్ని కూడా కంపెనీనే భరిస్తుంది. దీంతో పాటు నికర లాభం ఆధారంగా వేతనం పొందే వెసులుబాటు ఉంది.