Begin typing your search above and press return to search.

పోస్టులతో మనసు దోచే ఆనంద్ మహీంద్రాలో క్యూట్ లవ్వర్ ఉన్నాడట

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   26 March 2024 4:04 AM GMT
పోస్టులతో మనసు దోచే ఆనంద్ మహీంద్రాలో  క్యూట్ లవ్వర్ ఉన్నాడట
X

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశీయంగా మరే పారిశ్రామికవేత్తకు లేనంత ఫాలోయింగ్ ఆయన సొంతం. సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేసే పోస్టులు సామాన్యుల మనసుల్ని దోచేస్తుంటాయి. ఆయన తరచూ వార్తల్లో ఉంటారు. అది కూడా ఏళ్లకు ఏళ్లుగా. ఇన్నేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద యాక్టివ్ గా ఉంటూ.. ఏ రోజు వివాదంలో చిక్కుకోకుండా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. సోషల్ మీడియాలో ఇమేజ్ ఎంత త్వరగా వస్తుందో.. అంతే త్వరగా డ్యామేజ్ కూడా అవుతామన్న విషయాన్ని మర్చిపోకూడదు.అయినప్పటికీ.. ఆనంద్ మహీంద్రా మాత్రం ఈ కఠిన పరీక్షలో నిత్యం విజయం సాధిస్తూ ఉంటారు. అందుకే.. ఆయనంటే అన్ని వయస్కుల వారికి అదో అభిమానం. నిజానికి ఆయన మీద అభిమానం.. ఆయన సంస్థ మహీంద్రాకు ప్లస్ అయ్యిందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తుండటం తెలిసిందే.

తాజాగా ఆనంద్ మహీంద్రా క్యూట్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది. అది కూడా ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు. బాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తగ్గని రీతిలో ఆ స్టోరీ ఉండటం విశేషం. బాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఆయన తన మనసు దోచిన మహిళకు లవ్ ప్రపోజ్ చేశారు. ఇప్పుడామె ఆయన సతీమణిగా ఉన్నారు. ఇంతకూ ఆనంద్ మహీంద్రా లవ్ స్టోరీలోకి వెళితే.. ఆయన హార్వర్డ్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో కాలేజీ ఎసైన్ మెంట్ కోసం ఒక ఫిలిం షూట్ చేయటానికి ఇండోర్ వచ్చారు.

అక్కడ ఆయన తొలిసారి పదిహేడేళ్ల ఒక అందమైన మహిళను చూశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఆమే అనురాధా మహీంద్రా. ఆమెను చూసిన తర్వాత తిరిగి కాలేజీకి వెళ్లలేకపోయారు. ఆమెతో కాలం గడిపేందుకు ఆయన ఒక సెమిస్టర్ పరీక్షకు కూడా హాజరు కాలేదు. అక్కడే ఉండిపోయారు. ఆ రోజుల్లో అదెలాంటి పెద్ద నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అనురాధతో పీకల్లోతు లవ్ లో పడిన ఆయన.. బాలీవుడ్ హీరో మాదిరి తన అమ్మమ్మ తనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన రింగ్ ను ఆమెకు ఇచ్చి తన లవ్ ప్రపోజ్ చేశారు. దీంతో.. అనురాధ కూడా ఆయన ప్రేమను కాదనలేకపోయారు. కట్ చేస్తే.. వీరిద్దరి పెళ్లి 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది. ఇంతకూ ఆమె ఆనంద్ మహీంద్రా సతీమణి మాత్రమే కాదు.. ఆమె ప్రసిద్ధ లగ్జరీ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ వెర్వ్ వ్యవస్థాపకురాలు. అంతేకాదు.. మ్యాన్స్ వరల్డ్ మ్యాగజీన్ కు సహ వ్యవస్థాపకురాలు కూడా.

ముంబయిలో పుట్టిన అనురాధ అప్పట్లో ఫేమస్ అయిన సోఫియా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పెళ్లి తర్వాత ఈ జంట బోస్టన్ వర్సిటీలో చదువుకోవటానికి అమెరికాకువెళ్లారు. అక్కడే ఆమె కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ చేసి.. అనంతరం జర్నలిజం.. పబ్లిషింగ్ లో తన కెరీర్ ను షురూ చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఆనంద్ మహీంద్రాలో సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. క్యూట్ లవ్వర్ కూడా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. ఆయన మీద అభిమానం మరింత పెరగటం పక్కా.