Begin typing your search above and press return to search.

బైక్ మీద జర్నీ చేసే వారు జరజాగ్రత్త.. ఇలాంటి ముప్పు ఉంటుంది

సరదాగా బైక్ మీద జర్నీ చేసే అమ్మాయిలకు ఒక ముప్పు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా చీర.. పంజాబీ డ్రెస్ ధరించి.. చున్నీ వేసుకునే అమ్మాయిలు జర జాగ్రత్తగా ఉండాలి.

By:  Tupaki Desk   |   30 April 2025 11:00 PM IST
బైక్ మీద జర్నీ చేసే వారు జరజాగ్రత్త.. ఇలాంటి ముప్పు ఉంటుంది
X

సరదాగా బైక్ మీద జర్నీ చేసే అమ్మాయిలకు ఒక ముప్పు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా చీర.. పంజాబీ డ్రెస్ ధరించి.. చున్నీ వేసుకునే అమ్మాయిలు జర జాగ్రత్తగా ఉండాలి. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం.. బైక్ మీద జర్నీ వేళలో ఎంత కేర్ ఫుల్ గా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతంలోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గకు కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన మోహన్ క్రిష్ణతో తొమ్మిది నెలల క్రితం పెళ్లైంది. ఇతడికి అచ్యుతాపురం సెజ్ లో జాబ్ వచ్చింది. దీంతో.. ఈ దంపతులు ఇద్దరు అక్కడకు దగ్గర్లోని ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సోమవారం దుర్గకు చెవి నొప్పి రావటంతో.. రాత్రి ఏడు గంటల వేళలో ఆమెను తీసుకొని ఆసుపత్రికి వెళ్లేందుకు బైక్ మీద ప్రయాణమయ్యారు.

వీరి బైక్ హరిపాలెంకు వచిన సమయంలో దుర్గ వేసుకున్న చున్నీ బైక్ వెనుక చక్రంలో పడింది. వెంటనే. మెడను చుట్టేసింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించే సమయానికి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. వెంటనే వారు చున్నీని కత్తిరించారు. అప్పటికే ఆమె స్ప్రహలో లేదు. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దుర్గ అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్దారించారు. పెళ్లై తొమ్మిది నెలలు కూడా గడవక ముందే తమ కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్లిన వైనంతో వారి తల్లిదండ్రులు తీవ్రంగా వేదన చెందుతున్నారు. భార్య మరణాన్ని భర్త మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.