కాంగ్రెస్ ఏటీఎం...బీఆర్ఎస్ జీరో...షా సంచలనం
నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత అమిత్ షా అక్కడ జరిగిన రైతు సమ్మేళన్ బహిరంగ సభలో మాట్లాడారు.
By: Tupaki Desk | 30 Jun 2025 12:30 AM ISTతెలంగాణాలో ఎపుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి తప్పకుండా వచ్చే పార్టీ బీజేపీ అని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా జోస్యం చెప్పారు. తెలంగాణా అంతటా కాషాయం జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉందని అన్నారు. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే బీజేపీయే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత అమిత్ షా అక్కడ జరిగిన రైతు సమ్మేళన్ బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర రాజకీయం బీజేపీకి ఎంతో అనుకూలంగా ఉందని అన్నారు ఆ రెండు పార్టీల పని అయిపోయింది అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎం గా మారిందని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీరికి చిరునామా మారిందని అన్నారు. ఆ పార్టీ ఓడినా అవినీతి ఏ మాత్రం తగ్గలేదని అన్నారు. కాళేశ్వరం ధరణీ పోర్టల్ వంటివి బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనం అన్నారు.
తెలంగాణా రాజకీయాల్లో బీఆర్ఎస్ జీరో అని ఆ పార్టీ పని అయిపోయిందని షా అనడం విశేషం. బీజేపీవే ముందున్న రోజులు అన్నారు. బీజేపీ ప్రజలను నమ్ముతుంది, ప్రజలు కూడా బీజేపీని నమ్ముతారు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇస్తే కచ్చితంగా అమలు చేస్తారనడానికి పసుపు బోర్డు ఆఫీస్ ఒక పెద్ద ఉదాహరణ అన్నారు కాస్తా ఆలస్యం అయినా కావచ్చేమో మోడీ మాట మాత్రం నిలబెట్టుకుంటారు అన్నారు.
మోడీ నాయకత్వంలో ఈ రోజు దేశం వైపు ప్రపంచం అంతా చూస్తోంది అని అమిత్ షా అన్నారు. పహల్గాం దాడి తరువాత భారత్ తన శక్తిని చాటిందని గుర్తు చేశారు. ఉగ్రవాదంతో పాకిస్తాన్ భయపెట్టాలని చూస్తే దానికి తగిన గుణపాఠం చెప్పామని ఈ దెబ్బతో తోక ముడించింది అని అమిత్ షా సెటైర్లు వేశారు. కేవలం ఉగ్రవాదం పైనే కాదు దేశంలోని వ్యతిరేక శక్తుల మీద పోరు సాగుతుందని అన్నారు. మావోయిస్టుల గురించి ప్రస్తావిస్తూ వారు జన జీవన స్రవంతిలో కలసిపోవాలని లొంగి పోవాలని అమిత్ షా సూచించారు.
ఇదిలా ఉంటే అమిత్ షా బీజేపీని తెలంగాణాలో బలపడేలా చేయాలని చూస్తున్నారు అయితే ఆ పార్టీలో నేతల మధ్య అయితే అంతగా సఖ్యత లేదని అంటున్నారు. దీంతో వచ్చేది బీజేపీయే కాబట్టి ఎవరూ గాడి తప్పవద్దని అలాగే ఉదాశీన వైఖరి వద్దని కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
బీఆర్ ఎస్ పని అయిపోయింది అన్న అమిత్ షా వ్యాఖ్యల మీద సైతం చర్చ సాగుతోంది. రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ పైగా గ్రాస్ రూట్ లెవెల్ వరకూ క్యాడర్ ఉన్న పార్టీ అయిన బీఆర్ఎస్ అంత సులువుగా తగ్గిపోతుందా అన్నదే చర్చగా ఉంది. ఎంత పెరిగినా బీజేపీ బలం అంతా అర్బం ఏరియాలలోనే ఉందని అంటున్నారు రూరల్ బేస్ లో కమలం వికసించాలంటే చేయాల్సింది చాలా ఉందని అంటున్నారు. దాంతో అమిత్ షా వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ ని ఉత్సాపరచేందుకే అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే తెలంగాణాలో ట్రయాంగిల్ పోరు తప్పదు అని అంటున్నారు అది అంతిమంగా బీజేపీకి మేలు చేసేది కాదనే అంటున్నారు.
