Begin typing your search above and press return to search.

మదర్ ల్యాండ్ కాదని హోమ్‌ ల్యాండ్ కు... అడ్డంగా దొరికిన ఇండియన్!

అగ్రరాజ్యం కలలు చాలా మందికి ఉంటాయనడంలో సందేహం లేదు. డాలర్ డ్రీంస్ కోసం పరితపించేవారికి లోటు లేదని అంటారు

By:  Tupaki Desk   |   27 Sep 2023 7:55 AM GMT
మదర్ ల్యాండ్ కాదని హోమ్‌ ల్యాండ్ కు... అడ్డంగా దొరికిన ఇండియన్!
X

అగ్రరాజ్యం కలలు చాలా మందికి ఉంటాయనడంలో సందేహం లేదు. డాలర్ డ్రీంస్ కోసం పరితపించేవారికి లోటు లేదని అంటారు. అయితే వీరిలో కొంతమంది డబ్బులు సంపాదించుకుని, ఇండియాకు వచ్చి స్థిరపడాలని.. రిటైర్ మెంట్ లైఫ్ సొంత ఊరిలోనే గడపాలని భావిస్తుంటారు. మరికొంతమంది మాత్రం అమెరికాలోనే స్థిరపడిపోవాలని తపిస్తుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఒక భారతీయుడు అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దొడ్డిదారి తొక్కాడు. అధికారులకు దొరికిపోయాడు. ఇప్పుడు కోర్టులో ఆ నేరం రుజువైతే సదరు భారతీయుడికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో సుమారు రెండున్నర లక్ష డాలర్లు ఫైన్ పడే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. దీమో ఇతగాడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... వివేక్ చౌహాన్‌ అనే భారతీయుడు 2018, ఏప్రిల్‌ 2న మసాచుసెట్స్‌ లోని వోర్సెస్టర్‌ కు చెందిన అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. అనంతరం అదే ఏడాది జూన్ 1న తన ఇండియన్ పాస్‌ పోర్ట్‌ ను చూపించి, తనకు అమెరికా పౌరురాలితో పెళ్లైందనే విషయాన్ని పేర్కొంటూ, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందేందుకు హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే అయితే వారి వివాహం నిజం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా.. వివేక్ చౌహాన్‌ దంపతులు ఎప్పుడూ కలిసి నివసించలేదని, గ్రీన్ కార్డ్ పొందేందుకు ఆమెను "కాంట్రాక్ట్ మ్యారేజ్‌" చేసుకున్నాడని తెలుసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న అసిస్టెంట్ యూఎస్‌ అటార్నీ జాన్ డీ ఫాబియన్ ఈ వివరాలు వెల్లడించారు.

ఈ నేపధ్యంలో 2019 మే నెలలో యూఎస్‌ సిటిజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అతనిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో తాను చౌహాన్‌ తో కలిసి ఉంటున్నట్లు అతడి కాంట్రాక్ట్ భార్యగా చెబుతున్నామె అధికారులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో... యూఎస్‌ సిటిజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అతనిని 2021 నవంబర్‌ లో రెండవసారి ఇంటర్వ్యూ చేసింది.

ఇదే సమయంలో వివేక్ చౌహాన్‌ కూడా తనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదని, తాను తన భార్యతో కలిసి ఉంటున్నానని చెప్పాడట. అయితే ఆ కాంట్రక్ట్ వైఫ్... ఇప్పటికే ఇలాంటివి చాలా పనులు చేసిందని యూఎస్‌ సిటిజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇంటర్వ్యూలలో అబద్దాలు చెప్పి, అధికారులను తప్పుదారి పట్టించిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యిందని తెలుస్తుంది.

దీంతో ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ కేసులో నేరం రుజువైతే చౌహాన్ కు గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష.. 250,000 అమెరికన్‌ డాలర్ల జరిమానా విధిస్తామని యుఎస్ అటార్నీ ప్రకటించారు. అన్నీ అనుకూలంగా జరిగితే 2024 జనవరి 26న ఈ కేసులో శిక్ష ఖరారు కానున్నదని అంటున్నారు.