Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుడు ఐ ఫోన్ వాడలేరు... ఎందుకంటే..?

దీంతో వారు మార్కెట్ లోకి ఏ కొత్త గాడ్జెట్ వస్తే అది వాడుకోగలరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. వారు నూతన సాంకేతికత పరికరాలకు దూరంగానే ఉంటారు. కారణం... సెక్యూరిటీ!

By:  Tupaki Desk   |   12 Sep 2023 2:23 PM GMT
అమెరికా  అధ్యక్షుడు  ఐ ఫోన్  వాడలేరు... ఎందుకంటే..?
X

ప్రపంచం సరికొత్త గాడ్జెట్స్ విషయంలో ఎంత ముందుకు వెళ్తుందో... దానికి అనుగుణంగా హ్యాకింగ్ కూడా అభివృద్ధి చెందుతుందని, ఫలితంగా భద్రత అంత లోపిస్తుందని అంటుంటారు. ముఖ్యంగా హ్యాకర్లకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలే కీలక టార్గెట్ అని చెబుతుంటారు. ఇదే సమయంలో ఈ విషయాన్ని అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు అత్యంత బలంగా నమ్ముతాయి. దీంతో... అమెరికా అధ్యక్షులకు కొత్త గాడ్జెట్స్ వాడే ఛాన్స్ లేకుండా పోతుంది.

అవును... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అంటే వారిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. దీంతో వారు మార్కెట్ లోకి ఏ కొత్త గాడ్జెట్ వస్తే అది వాడుకోగలరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. వారు నూతన సాంకేతికత పరికరాలకు దూరంగానే ఉంటారు. కారణం... సెక్యూరిటీ!

గతంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైన తర్వాత తాను బ్లాక్‌ బెర్రీని ఉపయోగించడానికి భద్రతా సలహాదారులతో చాలా కాలం పోరాడాల్సి వచ్చిందని చెబుతుంటారు. అలా చాలా కాలం పోరాడిన తర్వాత సీనియర్ ఉద్యోగులు, దగ్గరి స్నేహితులతో మాత్రమే టచ్‌ లో ఉండేలా సవాలక్ష షరతులతో అనుమతి ఇచ్చారంత భద్రతా సిబ్బంది.

ఇదే సమయంలో 2010లో ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు కూడా ఒబామా ముచ్చటపడ్డారంట. దీంతో ఒబామా పరిస్థితి అర్ధం చేసుకున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మరింత సురక్షితమైన ఐప్యాడ్ "ఒబామాప్యాడ్‌"ని రూపొందించి ఇచ్చారంట.

ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే... ఆయన తన పదవీకాలంలో ట్విట్టర్‌ ను విరివిగా ఉపయోగించారు. అయితే ఆయన తన వ్యక్తిగత పనుల కోసం బర్నర్ ఫోన్లు వాడినట్లు చెబుతుంటారు. అయితే అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా వాటిని తొలగించారు.

ఈ విషయాలపై తాజాగా స్టాన్‌ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ లిన్ స్పందించారు. ఈయన తెలిపిన వివరాల ప్రకారం... హ్యాక్ చేయలేని స్మార్ట్‌ గాడ్జెట్ లు చాలా అరుదుగా ఉన్నాయి కాబట్టి... అందుకే ఎమ్రికా అధ్యక్షుడు ఏ స్మార్ట్‌ గాడ్జెట్‌ ను ఉపయోగించరు అని తెలిపారు.

ఇందులో భాగంగానే అమెరికా మాజీ అధ్యక్షులు అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ స్మార్ట్‌ గాడ్జెట్లకు దూరంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ యాపిల్‌ న్యూస్‌ యాప్‌ వినియోగిస్తున్నారని తెలుస్తుంది. ఇది ఎప్పుడైనా సమస్యలను సృష్టించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.