Begin typing your search above and press return to search.

ఢిల్లీ సెంటర్ గా..ఇంటర్వ్యూ లేకుండా యూఎస్ టూరిస్టు వీసా

అమెరికాకు టూరిస్టు వీసా మీద వెళ్లాలనుకునే వారికి వీలుగా.. సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   5 April 2024 8:30 AM GMT
ఢిల్లీ సెంటర్ గా..ఇంటర్వ్యూ లేకుండా యూఎస్ టూరిస్టు వీసా
X

అమెరికాకు టూరిస్టు వీసా మీద వెళ్లాలనుకునే వారికి వీలుగా.. సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. టూరిస్టు వీసా సేవలన్నింటిని ఇకపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని సెంటర్ చేయాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్లు ఢిల్లీ కార్యాలయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. స్లాట్ ఢిల్లీలో పొందినా.. దరఖాస్తుదారులు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు. వీసా ప్రాసెస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను దేశంలోని నాలుగు కాన్సులేట్ కార్యాలయాల్లోని డ్రాప్ బాక్సుల్లో సమర్పించే వీలుంది.

ఇంటర్వ్యూ అవసరమైన వారు మాత్రమే ఢిల్లీకి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా వేళ.. వీసాల జారీని నిలిపివేయటం తెలిసిందే. దీంతో.. టూరిస్టు వీసాల మీద అమెరికాకు వెళ్లాలనుకునే వారు వాటి స్లాట్లకు దాదాపు రెండున్నరేళ్ల గడువు పెరిగింది. దీంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వీసా గడువు ముగిసి ఏడాది కాని వారు ఇంటర్వ్యూ అవసరం లేకుండా వీసా పొందే వీలుంది. కొవిడ్ నేపథ్యంలో దానిని 48 నెలల గడువుగా పెంచుతూ.. ఆకాలంలో కొత్త వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

యూఎస్ టూరిస్టు వీసాకు అప్లై చేసేవారు.. ఇంటర్వ్యూ అవసరం లేకుండానే డాక్యుమెంట్లేు సమర్పించటం ద్వారా పూర్తి చేయొచ్చు. కాన్సులేట్ కార్యాలయంతో పాటు.. నాలుగు కాన్సులేట్ కార్యాలయాల్లోనూ డ్రాప్ బాక్స్ సదుపాయాన్ని కల్పించారు. వీసా అప్లికేషన్లను ఫ్రీగా సమర్పించే వీలుంది. వీటితో పాటు మరో ఆరు కేంద్రాల్లో డాక్యుమెంట్ డ్రాపాఫ్ వెసులుబాటును తీసుకొచ్చారు.

ఆ ఆరు కేంద్రాలు ఏవంటే..

బెంగళూరు

పుణె

అహ్మదాబాద్

చండీగఢ్

జలంధర్

కొచ్చిన్ కేంద్రాల్లో డ్రాపాఫ్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆరుకేంద్రాల్లో ఇంటర్వ్యూ మినహాయింపు అర్హులు తమ దరఖాస్తుల్ని సమర్పించుకోవచ్చు. కాకుంటే వీరు మాత్రం ఉచితంగా కాకుండా రూ.850 చెల్లిస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకు హాజరు కాకుండా బిజినెస్ వీసాను పొందే వెసులుబాటుతో సమయం.. ఖర్చు ఆదా అవుతుందని మాత్రం చెప్పొచ్చు.