Begin typing your search above and press return to search.

అమెరికాను వణికిస్తున్న ఫ్లూ... 15000 మంది మృతి!

అవును... అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫ్ల్యూ మరణాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:47 AM GMT
అమెరికాను వణికిస్తున్న ఫ్లూ... 15000 మంది మృతి!
X

అమెరికాలో ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులలో చేరగా.. వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ సీజన్ లో ఇలా ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య, మరణించినవారి సంఖ్య భారీగా ఉందని అంటున్నారు. ఈ మేరకు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా డేటా వెలుగులోకి వచ్చింది.

అవును... అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫ్ల్యూ మరణాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఈ తాజా సమాచారం ప్రకారం... ఈ సీజన్‌ లో ఇప్పటివరకు యూఎస్ లో సుమారు రెండు లక్షల ఏభై వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రుల్లో చేరగా... 15 వేల మరణాలు సంభవించాయి.

ఇదే సమయంలో... ఫిబ్రవరిలో ఇన్‌ ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు కూడా నమోదయ్యాయి. ఇందులో భాగంగా... ఈ సీజన్‌ లో మొత్తం 74 ఇన్‌ ఫ్లుయెంజా సంబంధిత పీడియాట్రిక్ మరణాలు సంభవించగా... గడిచిన వారంలో 11 వేలకు పైగా భాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ విధంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో పెరుగుతున్న సీజనల్ ఇన్‌ ఫ్లుయెంజా కార్యకలాపాలు జాతీయ స్థాయిలో మరింతగా పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇన్‌ ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్నందున 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ వార్షిక ఫ్లూ వ్యాక్సిన్‌ ను పొందాలని సీడీసీ సిఫారసు చేసింది.