Begin typing your search above and press return to search.

అంబేడ్క‌ర్ స్మృతి వ‌నం రెడీ..

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుకున్నారు.. అంతే అయిపోయింది. అదే.. విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం

By:  Tupaki Desk   |   14 Jan 2024 3:00 AM GMT
అంబేడ్క‌ర్ స్మృతి వ‌నం రెడీ..
X

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుకున్నారు.. అంతే అయిపోయింది. అదే.. విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం నిలవనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు.

ఇవీ విశేషాలు..

+ విగ్రహం బేస్‌ కింది భాగంలో గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉంటాయి.

+ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉంటాయి.

+ ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

+ ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో అంబేడ్క‌ర్‌ చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఉంటుంది.

+ ఫస్ట్‌ ఫోర్‌లో 2,250చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి.

+ ఒక హాలులో అంబేడ్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు.

+ సెకండ్‌ ఫ్లోర్‌లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి.

+ అంబేడ్కర్‌ విగ్రహం ఎత్తు: 125 అడుగులు.

+ విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్‌ వరకు హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు.

+ ఈ నెల 19న సీఎం జ‌గ‌న్ త‌న చేతుల మీదుగా ఈ విగ్ర‌హాన్ని ప్రారంభించ‌నున్నారు.