Begin typing your search above and press return to search.

వీడియో... డ్యాన్స్ విషయంలో అంబటిపై ఇండస్ట్రీ జనాల టాక్ ఇదేనంట!

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రతీ ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్యాన్సులు చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 April 2024 5:33 AM GMT
వీడియో... డ్యాన్స్  విషయంలో అంబటిపై ఇండస్ట్రీ జనాల టాక్  ఇదేనంట!
X

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రతీ ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్యాన్సులు చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా అది తనకు ఇష్టమని.. తన నియోజకవర్గ ప్రజలతోనూ, అభిమానూల్తోనూ, అనుచరులతోనూ, గిరిజన మహిళలతోనూ డ్యాన్సులు చేయడంలో తప్పేముందని చెబుతుంటారు! ఈ నేపథ్యంలో... పవన్ కల్యాణ్ సినిమా "బ్రో"లో శ్యాంబాబు అని ఒక క్యారెక్టర్ సృష్టించి.. తనను ఇమిటేట్ చేశారని.. డైరెక్టుగా రాంబాబు అనే పేరు పెట్టకపోయారా అని అంబటి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత వచ్చినా 2024 సంక్రాంతికి... “అవును అంబటీ రాంబాబూ.. సంబరాల రాంబాబు” అనే లిరిక్స్ తో మరోపాటకు డ్యాన్స్ చేస్తూ.. పవన్ పై కౌంటర్స్ వేశారు! దీంతో... మంత్రి అంబటి రాంబాబు 66 ఏళ్ల వయసులో చేసిన డ్యాన్స్ లు వైరల్ గా మారాయి! ఇలా ఏపీ రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలోనూ అంబటి రాంబాబు డ్యాన్స్ లు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రాంబాబు... తన డ్యాన్స్ పై సినిమా ఇండస్ట్రీకి సంబంధిన వారు ఎలా రియాక్ట్ అయ్యరనే విషయాన్ని వెల్లడిచారు!

అవును... తాజాగా ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన అంబటి రాంబాబు... తన డ్యాన్స్ లు వైరల్ అయిన తర్వాత చాలా మంది తనకు ఫోన్ చేసి.. డ్యాన్స్ అద్భుతంగా ఉందని, పవన్ కళ్యాణ్ కూడా అలా చేయలేడని, ఒక్క చిరంజీవి మాత్రమే చేయగలుగుతాడని చెప్పారని అన్నారు. తనను డామినేట్ చేసేది చిరంజీవే తప్ప పవన్ కల్యాణ్ చేయలేడని చెప్పారని, 66 ఏళ్ల వయసులో పవన్ కల్యాణ్ కంటే అద్భుతంగా చేసినట్లు సినిమా ఫీల్డ్ లోనివారే చెప్పారని అన్నారు.

ఇలా.. తన డ్యాన్స్.. పవన్ కల్యాణ్ డ్యాన్స్ కంటే బాగుంటుందని, మెడ పైన చెయ్యి పెట్టడం తప్ప (సంజ్ఞలతో చూపిస్తూ) పవన్ కల్యాణ్ అలా డ్యాన్స్ చేయలేడని తనకు సినిమా ఇండస్ట్రీ వాళ్లే ఫోన్ చేశారంటూ అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి!