Begin typing your search above and press return to search.

అంబటి వర్సెస్ సీఎం రమేష్ : చెవులు మూసుకోవాల్సిందే !

ఒక ప్రముఖ టీవీ డిబేట్ ప్రొగ్రాం కి ఫైర్ బ్రాండ్ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అలాగే బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ వచ్చారు

By:  Tupaki Desk   |   15 May 2024 5:04 PM GMT
అంబటి వర్సెస్ సీఎం రమేష్ : చెవులు మూసుకోవాల్సిందే !
X

ఒక ప్రముఖ టీవీ డిబేట్ ప్రొగ్రాం కి ఫైర్ బ్రాండ్ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అలాగే బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ వచ్చారు. ఈ ఇద్దరిని పెట్టి డిబేట్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. హీటెడ్ డిస్కషన్ లోకి వెళ్ళిపోయింది. అంతే అంబటి సీఎం రమేష్ ఇద్దరూ ఒకరిని ఒకరు చెప్పరాని మాటలతో దూషించుకున్నారు.

లైవ్ లోనే ఇద్దరూ తిట్టుకున్నారు. సన్నాసి యూజ్ లెస్ ఫెలో, ఒళ్ళు బలసి కొట్టుకుంటున్నావ్. చీప్ ఫెలో ఇలాంటి మాటలతో ఒకరిని ఒకరు దారుణంగా తిట్టుకున్నారు నేను తలచుకుంటే నీవు ఉన్న చోట నుంచి బయటకు పోలేవు అని ఒక దశలో సీఎం రమేష్ అంబటిని హెచ్చరించారు. దానికి అంబటి నోరు జాగ్రత్త పెట్టుకో అంటూ కౌంటర్ ఇచ్చారు.

అందుకే తాను డిబేట్ కి రాను అని చెప్పాను అని సీఎం రమేష్ అన్నారు. అంబటి రాంబాబు కూడా అంతే తీరున రెస్పాండ్ అయ్యారు. మొత్తానికి డిబేట్ కాదు కానీ ఇద్దరు నేతలూ ఒక రేంజిలో రెచ్చిపోయారు. ఒకరి గురించి ఒకరు వినలేని విధంగా లైవ్ లోనే తిట్టుకున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది అని సీఎం రమేష్ అంతకు ముందు డిబేట్ లో చెప్పారు. క్యూ లైన్లలో మహిళలు అంతా కూడా కూటమికే మద్దతు పలికారు అని ఆయన అన్నారు. దానికి రాంబాబు కౌంటర్ ఇస్తూ వైసీపీకే జనాలు జేజేలు పలికారు అన్నారు. మహిళల కోసం వైసీపీ ఏమి చేసింది అని సీఎం రమేష్ ప్రశ్నించారు. సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేశారా అని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు బాబు ఏమి చేశారో అందరికీ తెలుసు అని అంబటి బదులిచ్చారు.

ఇలా ఇద్దరూ వాదించుకుంటూ ఒక దశలో పూర్తిగా వ్యక్తిగతానికి వెళ్ళిపోయారు. దాంతో పరస్పరం నిందించుకున్నారు. ఏపీలో చూస్తే రాజకీయం మొత్తం అలాగే ఉంది. రెండు వైపుల నుంచి హీట్ గా వాతావరణం ఉంది. ఎవరికి వారుగా ఎదుట పడలేని పరిస్థితి. నాయకులే ఇలా ఒకరి మీద ఒకరు ఆవేశ కావేశాలు ప్రదర్శిస్తూంటే క్యాడర్ సైతం గ్రౌండ్ లెవెల్ లో మరోలా రియాక్ట్ అవుతోంది.

మొత్తానికి ఆ చానల్ డిబేట్ కాస్తా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీయడంతో దానిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఒక చర్చగా సాగుతూంటే ఎవరు పవర్ లోకి వచ్చినా రెండవవారితో ఘర్షణ తప్పదని అది అలా కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.