Begin typing your search above and press return to search.

కులం...రసికులం...అంబటికి అయ్యన్న షాక్...!

కులం లేని రాజకీయం లేదు. రాజకీయాల్లో కులం ఉండక తప్పని సీన్. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతాశ్రీలు కులం గురించి మాట్లాడకుండా ఉంటారా

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:55 AM GMT
కులం...రసికులం...అంబటికి అయ్యన్న షాక్...!
X

కులం లేని రాజకీయం లేదు. రాజకీయాల్లో కులం ఉండక తప్పని సీన్. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతాశ్రీలు కులం గురించి మాట్లాడకుండా ఉంటారా. మంత్రి అంబటి రాంబాబు ఖమ్మం వెళ్తే అక్కడ ఆయన మీద దాడి జరిగింది అని వైసీపీ నేతలు అంటూంటే అది నిరసన అని టీడీపీ అనుకూల మీడియా అంటోంది.

తన మీదకు కర్రలు పట్టుకుని దాడి చేస్తే దాన్ని నిరసన అంటారా అని అంబటి మీడియా సమావేశం పెట్టి మరీ టీడీపీ అనుకూల మీడియాని గట్టిగా నిలదీశారు. అంతే కాదు తన మీద దాడికి పాల్పడింది కులోన్మాదంతో అని ఫైర్ అయ్యారు. మీకే కాదు నాకూ ఒక కులం ఉంది అని ఆయన మాటల మంటలనే రేపారు.

ఏపీలో ఒకనాడు వంగవీటి రంగాను ఈ కులోన్మాదమే పొట్టన పెట్టుకుందని, అలాగే గడచిన సంవత్సరాలలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కూడా దారుణంగా హింసించింది కులోన్మాదమే అంటూ ఫ్లాష్ బ్యాక్ విషయాలను అన్నీ ముందుకు తెచ్చి ఒక రేంజిలో టీడీపీ మీద ఫైర్ అయ్యారు. మేము టీడీపీ వాళ్ళమని తన మీద దాడి చేసిన వారే చెప్పారని అన్నారు.

ఒక తన మీద దాడి చేసింది కూడా ఒక సామాజికవర్గానికి చెందిన వారు అని అంబటి ఆరోపించారు. మీ కులోన్మాదానికి రోజులు చెల్లాయని కూడా హెచ్చరించారు. తన వెనక కులం ఉందని తాను కూడా భయపడకుండా పోరాడగలను అంటూ కులాల కుంపటి ని ముందుకు తెచ్చారు.

అయితే అంబటి విమర్శల మీద ఏపీ టీడీపీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు రియాక్ట్ అయ్యారు. నాకూ కులం ఉంది అని అంబటి ట్వీట్ చేసిన దానికి రీ ట్వీట్ చేస్తూ అవును రసికులమేగా అని ఒక్క మాటతో మొత్తం సీన్ మార్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ మధ్యన అంబటి రాంబాబు మీద మరో మాజీ మంత్రి మీద మహిళలను లైంగికంగా వేధించినట్లుగా ఆడియోలు ప్రచారంలోకి వచ్చాయి. అవి ఫేక్ అని వారు ఖండించారు కూడా.

అయితే దాన్ని సమయానుకూలంగా అయ్యన్నపాత్రుడు మాత్రం మరచిపోకుండా వదులుతూనే ఉన్నారు. ఆ మధ్యన గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు గంట అరగంటా అంటూ అంబటి ని అవంతిని డైరెక్ట్ గా కెలికి వదిలారు. ఇపుడు అంబటి కులం అంటే రసికులం అంటూ మళ్లీ ఎక్కడో కెలికారు. అసలే తన మీద దాడి జరిగింది అని మంటెక్కి ఉన్న మంత్రి అంబటి అయ్యన్న ట్వీట్ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు.